Sreeleela: ఆ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న శ్రీలీల.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోయిన్లలో శ్రీలీల కూడా ఒకరనే సంగతి తెలిసిందే. శ్రీలీల నటించి విడుదలైన రెండు సినిమాలు సక్సెస్ సాధించగా మరో మూడేళ్ల పాటు శ్రీలీల నటించిన సినిమాలు వరుసగా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రీలీల షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎల్‌కేజీలో ఉన్న సమయంలోనే డాక్టర్ అవుతానని చెప్పేదానినని నన్ను డాక్టర్ గా చూడాలని అమ్మమ్మ, తాతయ్య కల అని ఆమె అన్నారు.

మూవీ ఆఫర్లు వచ్చిన సమయంలో నా చదువు పాడవుతుందేమో అని కుటుంబ సభ్యులు భయపడ్డారని శ్రీలీల చెప్పుకొచ్చారు. నేను డాక్టర్ అవుతానని మాటిచ్చి ఇండస్ట్రీకి వచ్చానని తాతయ్యకు ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకుంటానని శ్రీలీల వెల్లడించడం గమనార్హం. నేను ఎక్కడికి వెళ్లినా పుస్తకాలు నాతో పాటు ఉంటాయని పరీక్షల సమయంలో రాత్రిపూట పుస్తకాలు చదువుకుంటానని ఆమె అన్నారు. నేను వర్కౌట్లు చేయనని యోగా మాత్రమే చేస్తానని శ్రీలీల అన్నారు.

డ్యాన్స్, స్విమ్మింగ్ కూడా నా దినచర్యలో భాగమని శ్రీలీల (Sreeleela) చెప్పుకొచ్చారు. తొమ్మిదో తరగతిలోనే కిస్ సినిమాతో కెరీర్ మొదలైందని ఫోటోషూట్ వల్ల ఆ మూవీలో ఛాన్స్ దక్కిందని శ్రీలీల అన్నారు. కిస్ సినిమాకు సైమా అవార్డ్ ను అందుకున్నానని శ్రీలీల వెల్లడించారు. అమ్మ గైనకాలజిస్ట్ అని అమ్మ వల్లే తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నానని శ్రీలీల అన్నారు.

అంగవైకల్యంతో బాధ పడుతున్న శోభిత, గురు అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నానని శ్రీలీల చెప్పుకొచ్చారు. నాలో అపరిచితుడు ఉన్నాడని నా కోపానికి అమ్మ ఎక్కువసార్లు బలైందని శ్రీలీల అన్నారు. శ్రీలీల వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుస విజయాలతో శ్రీలీల సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus