Sreeleela: శ్రీలీల మరో అనుష్క అవుతారా.. ఆ సినిమాలకు ఓకే చెబుతారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి సినిమాతో శ్రీలీల ఖాతాలో మరో హిట్ చేరింది. భగవంత్ కేసరి సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్లలో నటించి శ్రీలీల మంచి పేరు సంపాదించుకున్నారు. భగవంత్ కేసరి బాలయ్యకు ఏ స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టిందో శ్రీలీలకు అదే స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టింది. భగవంత్ కేసరి సక్సెస్ తో శ్రీలీలకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పని చేసే ఛాన్స్ వస్తుందని సమాచారం అందుతోంది.

భగవంత్ కేసరి వల్ల అలాంటి ఆఫర్లు వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో శ్రీలీల జాతకం మారిపోనుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలీల మరో అనుష్క అవుతారని శ్రీలీల అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు శ్రీలీల ఓకే చెబుతారో లేదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. శ్రీలీల రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉండగా రాబోయే రోజుల్లో శ్రీలీల కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

ఇతర భాషల్లో సైతం (Sreeleela) శ్రీలీల ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. శ్రీలీల నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బాలయ్య హీరోగా శ్రీలీల కీలక పాత్రలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. భగవంత్ కేసరి సినిమాకు సీక్వెల్ తెరకెక్కితే బాగుంటుందని మరి కొందరు ఫీలవుతున్నారు.

శ్రీలీల సక్సెస్ రేట్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. గుంటూరు కారం సినిమా సక్సెస్ సాధిస్తే శ్రీలీల కెరీర్ కు తిరుగుండదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలీల రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కథల ఎంపికలో శ్రీలీల పొరపాట్లు చేయకూడదని అభిమానులు ఫీలవుతున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus