Sreeleela: అక్కడ లైనప్‌ పెంచుకుంటూ వెళ్తున్న శ్రీలీల.. తెలుగు మళ్లీ ఎప్పుడు?

ఒకప్పుడు సౌత్‌ హీరోయిన్లు బాలీవుడ్‌కి వెళ్లి ఒకటో రెండో సినిమాలు చేసి తిరిగి వెనక్కి వచ్చేసేవారు. ఆ హీరోయిన్‌ నార్త్‌ నుండి వచ్చిన అమ్మాయి అయినా సరే.. ఒకసారి సౌత్‌కి వస్తే ఇక ఇక్కడే అని ఉండేవారు. అప్పుడప్పుడు బాలీవుడ్‌కి వెళ్లి వచ్చేసేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్లు అలా ఆలోచించడం లేదు. సౌత్‌లో కొన్నేళ్లుగా స్టార్‌ హీరోయిన్‌గా ఉన్నాక.. బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ పాతుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక మందన ఇదే పని చేసి.. పాన్‌ ఇండియా హీరోయిన్‌ అవ్వగా.. నెక్స్ట్‌ ఆ తరహా ప్రయత్నం చేస్తోంది శ్రీలీల.

Sreeleela

అవును, కార్తిక్‌ ఆర్యన్‌కి జోడీగా ‘ఆషికి 3’ సినిమా కోసం బాలీవుడ్‌కి వెళ్లిన శ్రీలీల ఇప్పుడు ఒక్కో సినిమాను కొత్తగా ఓకే చేసిన పనిలో పడింది. యంగ్‌ హీరోల సినిమాల చర్చలు ఓవైపు చేస్తోంది. అయితే ఏవీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ క్రమంలో ‘దోస్తానా 2’ సినిమాలో శ్రీలీల నటిస్తున్నట్లు సమాచారం. ఆ సినిమాలో విక్రాంత్‌ మసే సరసన శ్రీలీల నటించబోతోందట. ఈ మేరకు త్వరలో అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అంటున్నారు. నిజానికి జాన్వీ కపూర్‌ని తొలుత ఆ పాత్ర కోసం అనుకున్నా.. ఆమె అందుబాటులో లేకపోవడంతో శ్రీలీల ఆ ప్లేస్‌లోకి వచ్చిందట.

ఒకవేళ ఈ సినిమా ఓకే అయితే శ్రీలీల ఇప్పట్లో తెలుగు సినిమాలో నటించే అవకాశం లేదు అని అంటున్నారు. ఎందుకంటే ఆమె చేతిలో రెండు తెలుగు సినిమాలు (‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’, ‘మాస్‌ జాతర’) మాత్రమే ఉన్నాయి. అందులో ‘మాస్‌ జాతర’ సినిమా షూటింగ్ అయిపోయింది. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా ప్యాచ్‌ వర్క్‌ మాత్రమే ఉంది అని అంటున్నారు. ఈ రెండు కాకుండా ఆమె ఇంకేం కొత్త సినిమాలు ఓకే చేయలేదు. అయితే కోలీవుడ్‌లో శివ కార్తికేయన్‌ ‘పరాశక్తి’ సినిమాకు ఓకే చెప్పింది. అంటే సౌత్‌లో శ్రీలీల చేస్తున్నవి మూడు సినిమాలు మాత్రమే. చూద్దాం బాలీవుడ్‌ నుండి మళ్లీ వెనక్కి వచ్చి సినిమాలు చేస్తుందేమో?

 ‘ఓజీ’ ఫీవర్‌ అయిపోయింది.. ‘ఉస్తాద్‌’ ఊపు ఎప్పుడు? హరీశ్‌ ప్లానేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus