Sreeleela: ఇంటర్వ్యూ : ‘భగవంత్ కేసరి’ గురించి శ్రీలీల చెప్పిన ఆసక్తికర విషయాలు

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలకృష్ణకి కూతురిగా శ్రీలీల నటిస్తుంది. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది శ్రీలీల. అవి మీ కోసం :

ప్ర) మీరు ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్..! ఇలాంటి టైంలో ‘భగవంత్ కేసరి’ లో కూతురి పాత్ర చేయడం రిస్క్ అనిపించలేదా?

శ్రీలీల : అస్సలు అనిపించలేదు.ఎందుకంటే ‘భగవంత్ కేసరి’ కథ నాకు బాగా నచ్చింది. గ్లామర్ రోల్స్ చేయడానికి చాలా సినిమాలు ఉంటాయి. కానీ ఇలాంటి ఎమోషనల్ సబ్జెక్ట్ లో నటించే అవకాశం తొందరగా రాదు. నా పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న రోల్ కూడా..!అందుకే దీనిని మిస్ చేసుకోవాలనుకోలేదు.శ్రీలీల అంటే డ్యాన్స్ మాత్రమే అనే ముద్ర పడిపోయింది. అది మంచిదే కానీ.. దానికి మాత్రమే పరిమితమైపోవాలని అనుకోవడం లేదు.

ప్ర) మీకు చాలా త్వరగా స్టార్ డం వచ్చింది. అది మీకు బరువుగా అనిపిస్తుందా?

శ్రీలీల : ఆనందంగా అయితే ఉంది. కానీ స్టార్ హీరోయిన్ అన్నంత మాత్రాన కష్టపడటం ఆపేయొచ్చు అని కాదు. మహా అయితే సెట్స్ కి కొంచెం లేట్ గా వెళ్లినా ఎక్స్క్యూసెస్ ఉంటాయేమో అంతే..!(నవ్వుతూ)

ప్ర) బాలకృష్ణ గారితో సెట్స్ లో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించేది?

శ్రీలీల : మొదటి షాట్ ట్రైలర్ లో చూపించిన ట్రైనింగ్. నేను పుష్ అప్స్ చేయాలి. కానీ చేయలేకపోతుంటాను. ఆయన పట్టుబట్టి చేయిస్తుంటారు. షాట్ అయిన తర్వాత నిజంగా నీకు పుష్ అప్స్ చేయడం రాదా ? అని అడిగారు. డైరెక్టర్ గారే అలా చేయమన్నారని చెప్పాను(నవ్వుతూ). నిజానికి నాలో కొంచెం నెర్వస్ ఫీలింగ్ ఉంది. ఆయన్ని కలిసినప్పుడు ఒక భయం ఉంది. ఐతే ఆయనను కలిసిన మరుక్షణమే ఆ భయం పోయింది. నిజంగా ఆయనకు యాప్ట్ పేరు పెట్టారు. ఆయనది పసి మనసు. చాలా స్వీట్.

ప్ర) అనిల్ రావిపూడి గారి సినిమాల్లో హీరోయిన్స్ చాలా యాక్టివ్ గా ఉంటారు.. కామెడీ చేస్తారు.. ఇందులో మీ పాత్ర అలానే ఉంటుందా?

శ్రీలీల :కాదు.. అనిల్ రావిపూడి గారు ఈ సినిమాని డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేస్తారు. నేను చేసిన విజ్జి పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. విజ్జి పాప భయపడే అమ్మాయి. అదే సమయంలో చలాకీగా కూడా ఉంటుంది.

ప్ర) బాలకృష్ణ గారికి మీకు కాంబినేషనల్ సీన్స్ ఉంటాయా?

శ్రీలీల :బాలకృష్ణ గారి గురించి ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండదు. ఆయనకి అన్ని అన్ని విషయాల్లోనూ పట్టు ఉంది. నా వరకు నేను గమనించింది అది. ఒకసారి నేను మెడిసిన్ పరీక్ష రాసి వచ్చిన తర్వాత అందులోని చాప్టర్స్ పై చాలా లోతైన పరిజ్ఞానంతో ఆయన మాట్లాడేవారు. ఆయన మెడిసిన్ చేయలేదు కదా ఇదెలా తెలిసిందని ఆశ్చర్యపోయేదాన్ని. షూటింగ్ సమయంలో కూడా ఒక సీన్ ఎలా చేస్తే బావుంటుందో చెప్పేవారు. విజ్జి పాప., నేలకొండ భగవంత్ కేసరి.. ఈ రెండు పాత్రలు మమ్మల్ని ఇంకా దగ్గర చేశాయి అనుకోవచ్చు

ప్ర) కాజల్ తో చేయడం ఎలాంటి ఫీలింగ్ కలిగించింది?

శ్రీలీల :కాజల్ గారు బ్యూటీ విత్ బ్రెయిన్ అని నేను భావిస్తాను. ఆమె టైమింగ్ బాగుంటుంది. చాలా మంచి సలహాలు ఇచ్చారు. చాలా విషయాలు నేర్పారు. కాజల్ గారితో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్.

ప్ర)అనిల్ రావిపూడి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

శ్రీలీల :ఆయన చాలా యాక్టివ్ పర్సన్. అలాగే పాజిటివ్ పర్సన్ కూడా. ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించి అక్కడే ఆగిపోయే వ్యక్తి కాదు. ఆయన అందరితో కలిసే విధానం బాగుంటుంది. అందరినీ యాక్టివ్ చేయడానికి కామెడీ కూడా చేస్తుంటారు. అందుకే ఆయన సినిమాల్లో కామెడీ కూడా బాగా వర్కౌట్ అవుతుంది అని నేను అనుకుంటాను.

ప్ర) నిర్మాతలు గురించి చెప్పండి?

శ్రీలీల : సాహు గారు, హరీష్ గారు చాలా మంచి వ్యక్తులు. సినిమాకి ఓ గ్రాండియర్ లుక్ తీసుకురావడానికి వారి తపన ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది.

ప్ర) తమన్ మ్యూజిక్ గురించి చెప్పండి?

శ్రీలీల : ఆయనతో కలిసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఆయనలానే నేను కూడా బిజీగా ఉండడం కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఆయన మ్యూజిక్ కూడా అందరిలో ఎనర్జీ నింపుతూ ఉంటుంది. ఈ సినిమాలో కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది.

ప్ర)అప్పుడే మీ ట్రాక్ రికార్డ్ 10 సినిమాలకి చెరువవుతుంది.. ఎలా ఫీలవుతున్నారు?

శ్రీలీల :చాలా ఆనందంగా ఉంది. నాకు (Sreeleela) మొదట అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావు గారికి, నాపై నమ్మకం ఉంచిన ప్రతి దర్శకుడికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకోవాలి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus