Sreeleela: ఆ సినిమాతో శ్రీలీల ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమా?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల తెలుగులో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు హిట్ అయ్యాయి. 80 శాతం సక్సెస్ రేట్ ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. భగవంత్ కేసరి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న శ్రీలీల త్వరలో తర్వాత సినిమాల ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నారు. శ్రీలీల తర్వాత మూవీ ఆదికేశవ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.

ఆదికేశవ మూవీ నుంచి థర్డ్ సింగిల్ ప్రోమో తాజాగా విడుదలైంది. 2023 సంవత్సరం నవంబర్ 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించడం గమనార్హం. శ్రీలీల పేరుతో లీలమ్మో అనే సాంగ్ ను ఈ సినిమాలో పెట్టారు. శ్రీలీల రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది.

ఆదికేశవ సినిమా కమర్షియల్ గా ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. వైష్ణవ్ తేజ్ కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. వైష్ణవ్ తేజ్ కథల విషయంలో మామయ్యల సహాయం కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ 8 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాతో శ్రీకాంత్ తన క్రేజ్, రేంజ్ ను మరింత పెంచుకుంటారేమో చూడాల్సి ఉంది. వైష్ణవ్ తేజ్ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సాయిధరమ్ తేజ్ విరూపాక్ష, బ్రో సినిమాలతో సక్సెస్ లను అందుకోగా వైష్ణవ్ తేజ్ కూడా వరుస విజయాలను అందుకోవాలని ఆశిద్దాం. ఆదిపురుష్ తో శ్రీలీల (Sreeleela) మ్యాజిక్ ను రిపీట్ చేసి మరో బ్లాక్ బస్టర్ అందుకుంటారేమో చూడాలి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus