Sreeleela: శ్రీలీల మొదటి సినిమా ఫిక్స్‌.. మరి ఆయనతో తిరిగిందేంటో?

మన శ్రీలీల (Sreeleela) బాలీవుడ్‌కి వెళ్తోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమె కూడా ముంబయికి వెళ్లి సినిమా ఆఫీసుల దగ్గర కనిపిస్తోంది. ఓ యువ హీరోతో కూడా ఆమె చట్టాపట్టాలేసుకొని తిరగడం చూశాం. ఓ ఓటీటీ షోకి వచ్చినప్పుడు బాలీవుడ్‌ సంగతేంటి అని అడిగితే ఉంది అని చెప్పింది కానీ ఏ సినిమా అనేది చెప్పలేదు. ఎట్టకేలకు ఆ సినిమా ఏంటి అనేది క్లారిటీ వచ్చేసింది. సినిమా టీమ్‌ టీజర్‌ రిలీజ్‌ చేసింది.

Sreeleela

గతేడాది ‘కిస్సిక్‌’ అంటూ దేశవ్యాప్తంగా కుర్రకారుని ఉర్రూతలూగించిన శ్రీలీల బాలీవుడ్‌ ఎంట్రీ ఓ సీక్వెల్‌తో అని తెలుస్తోంది. ‘ఆషికీ’, ‘ఆషికీ 2’ అంటూ రెండు సినిమాలతో ఇండస్ట్రీలో ఓ రేంజి విజయం అందుకున్న టీమ్‌ ఇప్పుడు శ్రీలీల – కార్తిక్‌ ఆర్యన్‌తో (Kartik Aaryan) ‘ఆషికీ 3’ అనౌన్స్‌ చేశారు. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో సినిమా అనౌన్స్‌మెంట్‌ వీడియోను రిలీజ్‌ చేశారు.

కార్తిక్‌ ఆర్యన్‌ హీరోగా అనురాగ్‌ బసు తెరకెక్కిస్తున్న సినిమాలోనే శ్రీలీల నటిస్తోంది అనేది ఆ టీజర్‌ సారాంశం. ‘‘నువ్వు నా దానివి, నువ్వే నా ప్రతి ఆనందానివి’’ అంటూ ఓ పాటను కార్తిక్‌ ఆర్యన్‌ ఆలపించడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అంటే కార్తిక్‌ గాయకుడిగా, ఆయన ప్రేయసిగా శ్రీలీల కనిపిస్తుంది అన్నమాట. నిజానికి ఇది ‘ఆషికీ 3’ అని టీమ్‌ చెప్పకపోయినా.. అదే సినిమా అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

నిజానికి శ్రీలీల తొలి బాలీవుడ్‌ సినిమా ప్రముఖ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ (Saif Ali Khan) తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్‌ హీరోగా రూపొందనున్న తొలి సినిమా అవుతుంది అని తొలుత వార్తలొచ్చాయి. ఈ మేరకు వాళ్లిద్దరూ ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టడం కూడా మనం వీడియోల్లో చూశాం. ఇప్పుడు ఈ సినిమా అనౌన్స్‌ చేశారు కాబట్టి ఆ సినిమా రెండోది అవుతుంది. అంటే ఈ ఏడాది శ్రీలీల సినిమాలు రెండు బాలీవుడ్‌లో వస్తాయి. ‘ఆషికీ 3’ అయితే దివాళీకి తీసుకొస్తున్నారు.

ఇన్నాళ్ళకు ఓ పాన్ ఇండియా ఆఫర్ పట్టేసిన కలర్స్ స్వాతి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus