Sreeleela: ఒక డైలాగ్ తో పవన్ ఫ్యాన్స్ ని ఫిదా చేసిన శ్రీలీల

పవన్ కళ్యాణ్ కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగ్ గురించి అందిరికీ తెలిసిందే. ఈ స్టార్ హీరోయిన్ కు ఫ్యాన్స్ గా, సామాన్య ప్రజలు మాత్రమే కాదు, సెలబ్రెటీలు కూడా ఉంటారు. ఎంత మంది హీరోలు, హీరోయిన్స్ తాము పవన్ కళ్యాణ్ అభిమానులం అంటూ సందర్భం వచ్చిన ప్రతి సారి చెబుతూనే ఉంటారు. ఈ లిస్ట్ లో తాజాగా మరో హీరోయిన్ చేరిపోయింది. ఇటీవల భగవంత్ కేసరి సినిమాలో బాలయ్యకు కూతురిగా నటించిన శ్రీలీల. యంగ్ హీరోయిన్ శ్రీలీల..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్. స్టార్ హీరోలు యంగ్ హీరోలు అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు 7 నుంచి 8 సినిమాలు ఉన్నాయి. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆది కేశవ్ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా నుంచి ఇటీవల ఓ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఈ సాంగ్‌లో ఆమె చేసిన మాస్ డ్యాన్స్ కు పాజిటివ్ టాక్ వస్తుంది.

అయితే ఆది కేశవ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలనే ప్రశ్న శ్రీలీలకు ఎదురైంది. దీంతో శ్రీలీల… ఆయన దైవంతో సమానం. అని కామెంట్ చేసింది. పవన్ కళ్యాణ్ గారి చూట్టు ఉన్న ఆరా చాలా స్పెషల్. ఆయన్ని చూసినప్పుడు దేవుడిని చూసిన ఫీల్ వస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. నిజానికి పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ దేవుడు అనే పిలుస్తారు.

ఇప్పుడు హీరోయిన్ శ్రీలీల (Sreeleela) కూడా పవన్ ను దేవుడు అనడంతో, ఈ వ్యాఖ్యలను పవర్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి కే కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. శ్రీలీల ఇప్పటి వరకు మూడు షెడ్యూల్ షూటింగ్స్ లో పాల్గొంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus