Sreeleela: సినిమాల విషయంలో శ్రీలీల ఆలోచనలు మారాలా? బ్రేక్‌ ఎప్పటికో?

చేతిలో తొమ్మిది సినిమాలు… వరుస షూటింగ్‌లు… అస్సలు తీరికలేదు… గత కొన్ని నెలలుగా శ్రీలీల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ విషయాలు మాట్లాడేవారు. అయితే ఇప్పుడు ఆ విషయాలకు మరొకటి యాడ్‌ అయ్యింది. అదే ‘సరైన విజయం కావాలి’. అవును మీరు చదివింది కరెక్టే. ఎందుకంటే వరుస సినిమాలు అయితే వస్తున్నాయి కానీ… అందులో ఆమె హైలైట్‌ కావడం లేదు. కొన్ని సినిమాలు అయితే విజయాలే సాధించలేదు. కావాలంటే మీరే చూడండి శ్రీలీల అనగానే మనకు గుర్తొచ్చే సినిమాల్లో అయితే ఆ సినిమా హీరోకు పేరొస్తోంది,

లేదంటే శ్రీలీల డ్యాన్స్‌కి పేరొస్తోంది. అంతేకానీ నటిగా ఆమెకు అంత అప్లాజ్‌ రావడం లేదు. శ్రీలీల తెలుగు వారికి తెలియడానికి ‘ధమాకా’ సినిమానే కారణం. ఆ సినిమాలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌, డ్యాన్స్‌కే పేరొచ్చింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఆ స్థాయి పేరు రాలేదు. దీంతో ఆమె కథల ఎంపిక విషయంలో డౌట్స్‌ వస్తున్నాయి. బోయపాటి శ్రీను హీరోయిన్‌ అంటే… నటనకు ప్రాధాన్యమున్న పాత్ర అని అనేవారు. అయితే ‘స్కంద’లో అలాంటి పరిస్థితి కనిపించలేదు.

ఇక ‘భగవంత్‌ కేసరి’లో ఆశించిన పేరు, గుర్తింపు రాలేదు. బాగుంది అనే మాట తప్ప. ఇక ‘ఆదికేశవ’ అయితే సగటు కమర్షియల్‌ హీరోయిన్‌ పాత్ర అనిపించుకుంది. దీంతో శ్రీలీలకు అర్జెంట్‌ భారీ విజయం రావాలి. అది కూడా స్టార్‌ హీరో సినిమా అవ్వాలి, అందులో ఆ పాత్రకు వాల్యూ ఉండాలి అని కోరుకుంటున్నారు ఫ్యాన్స్‌. ఆ దిశగా ఇప్పుడు ఆమెకు ఉన్న సినిమాలు చూస్తే నితిన్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ’ సినిమా వస్తోంది.

ఇందులో కూడా లీల పాత్ర కమర్షియల్‌ హీరోయినే అంటున్నారు. ఆ తర్వాత (Sreeleela) ఆమె ఖాతాలో మహేష్‌బాబు ‘గుంటూరు కారం’, పవన్‌ కల్యాణ్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఉన్నాయి. అవేమౌతాయి. స్టార్‌ హీరోల మేనియా మధ్య శ్రీలీల పాత్ర గుర్తింపు ఎంతవరకు అనేది చూడాలి. ఇక ఈ రెండూ కాకుండా విజయ్‌ దేవరకొండ సినిమా ఒకటి, నితిన్‌ సినిమా మరొకటి లైన్‌లో ఉన్నాయి అని టాక్‌. ఏదైతేనేం లీలమ్మో కాస్త చూసుకోవమ్మో.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus