Sreeleela: బాలీవుడ్ లో కిస్సిక్ పాప అలజడి!

శ్రీలీల (Sreeleela)   నటనకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది కానీ ఆమె డాన్స్ టాలెంట్‌ను ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) లోని కిసిక్ పాట నిజంగా మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ పాట యూత్‌ను అలరించడమే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డాన్స్ మూమెంట్స్, ఎక్స్‌ప్రెషన్స్ అన్ని మాస్ ఆడియెన్స్‌ను ఓ రేంజ్‌లో ఎంగేజ్ చేశాయి. ఈ పాటతో ఆమెకు యూనిక్ ఐడెంటిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీలీల టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ను సంపాదించుకోగా, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఆమెకు డిమాండ్ పెరిగినట్లు సమాచారం.

Sreeleela

పలు ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లు ఆమెను ఐటమ్ సాంగ్స్ కోసం సంప్రదించినట్లు బాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ అవకాశం శ్రీలీలకు కొత్త దారులు తెరిచే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్స్‌కు ఉన్న ప్రత్యేకమైన క్రేజ్ శ్రీలీలను త్వరగా నేషనల్ ఫిగర్‌గా మార్చగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. రెగ్యులర్ గా బాలీవుడ్ ఐటమ్ నంబర్లలో నోరా ఫతేహి (Nora Fatehi), మలైకా అరోరా (Malaika Arora), జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez) లాంటి స్టార్ డాన్సర్లతో పోలిస్తే, శ్రీలీల ‘కిసిక్’ పాటతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఈ పాట విడుదల తర్వాత బాలీవుడ్ మీడియా కూడా శ్రీలీల డాన్స్ టాలెంట్‌ను ప్రస్తావిస్తూ ఆర్టికల్స్ రాయడం విశేషం. ఇది ఆమె కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ఛాన్స్‌గా కనిపిస్తోంది. అయితే, ఇది ఆమెకు సరైన దిశ కాదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఒకవైపు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి అవకాశాలు వస్తున్నాయి.

అలాగే ఆమెకు హీరోయిన్స్‌ స్థాయిలో బ్రాండ్ బిల్డింగ్ జరుగుతోంది. అలాంటప్పుడు ఐటమ్ నంబర్లకు తన దృష్టిని మళ్లించడం ఆమె కెరీర్‌కు కలిసొస్తుందా అనే చర్చ కూడా జరుగుతోంది. పాన్ ఇండియా స్టార్‌గా ఎదగాలంటే ఆమె ఎంపికలు చాలా కీలకం. ఇక శ్రీలీల ‘కిసిక్’ సాంగ్ ద్వారా వచ్చిన క్రేజ్‌ను ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.

‘పుష్ప 2’… న్యూ ఇయర్‌ కాదు.. సంక్రాంతీ కాదు.. మరెప్పుడంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus