శ్రీలీల టాలీవుడ్ కు రాకెట్లా దూసుకొచ్చింది. ‘పెళ్లిసందD’ తో ఆమె ప్రయాణం మొదలైంది. ఆ వెంటనే ‘ధమాకా’ తో మంచి విజయాన్ని అందుకుంది. ఆ ‘భగవంత్ కేసరి’ అనే హిట్ ఈమె ఖాతాలో పడింది. ఈ క్రమంలో చేసిన ‘స్కంద’ ‘ఆదికేశవ’ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ‘రాబిన్ హుడ్’ ‘జూనియర్’ వంటి సినిమాలు అన్నీ డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి.
మధ్యలో మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ కొంత యావరేజ్ గా ఆడింది. వరుస ప్లాపులు రావడంతో శ్రీలీలకి ఇక ఆఫర్లు కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ ఆమె డిమాండ్ ఏమీ తగ్గలేదు. ‘పుష్ప 2’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసినందుకే భారీగా పారితోషికం అందుకుంటుంది. మరోపక్క హిందీలో, తమిళంలో వరుస సినిమాలు ఒప్పుకుంటూ ముందుకు సాగుతుంది.
అయితే ఎన్ని సినిమాలు ఒప్పుకుంటున్నా.. ఆమెకు సక్సెస్ దొరకడం లేదు. కేవలం పారితోషికానికి మాత్రమే టెంప్ట్ అయిపోయి ఆమె సినిమాలకు సైన్ చేసేస్తుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి మిస్టేక్ శ్రీలీలది కాదు ఆమె తల్లిది అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అవును శ్రీలీల సినిమాల విషయంలో ఆమె తల్లి స్వర్ణలత ప్రమేయం ఎక్కువగా ఉంటుందట. పారితోషికం లెక్కలు వర్కౌట్ అయితే ఆమె.. శ్రీలీలని ఎలాంటి సినిమాకైనా ఒప్పించేస్తుందట. అంతేకాదు శ్రీలీల షూటింగ్ కి వెళ్తే.. వెంటే ఈమె కూడా వెళ్తుంది. శ్రీలీల డిమాండ్లు కంటే ఈమె డిమాండ్లు ఎక్కువగా ఉంటాయనేది ఇన్సైడ్ టాక్. శ్రీలీలతో స్నేహంగా ఉండే కొంతమంది ఫిలిం మేకర్స్ పరోక్షంగా.. ఆమె తల్లి గురించి చెప్పారట. కానీ శ్రీలీల కూడా వారి కామెంట్స్ ను లైట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా కొంత మంది స్టార్ హీరోయిన్ల తల్లులు అలాగే వ్యవహరించేవారు. వాళ్ళ డౌన్ ఫాల్ కి కూడా వాళ్ళే కారణం అయ్యారు. శ్రీలీల విషయంలో కూడా ఇదే జరుగుతుందా? లేక ఆమె జాగ్రత్తలు తీసుకుంటుందా అనేది చూడాలి.