Sreeleela: ఆ సినిమా రిలీజ్ అయితే శ్రీలీల ఇమేజ్ దెబ్బతింటుందా.. ?

శ్రీ లీల … ఒక్క సినిమాకే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు వరుస ఆఫర్ లు అందుకుంటూ దూసుకుపోతుంది. ధమాకా మూవీ మరో 10 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. రవితేజ వంటి స్టార్ హీరో సినిమాలో ఆఫర్ రావడంతో… వీరిద్దరి ఏజ్ గ్యాప్ గురించి బోలెడన్ని సెటైర్లు వచ్చినా.. వాటిని పట్టించుకోకుండా శ్రీలీల ఈ ఆఫర్ కు ఉ కొట్టింది. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ నుండీ బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా బాగానే ఉంది.

భీమ్స్ సంగీతంలో రూపొందిన పాటలు.. గ్లింప్స్ వంటి వాటికి మంచి రెస్పాన్స్ లభించింది. త్రినాథ్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం జనాల్లో ఉంది. కాబట్టి ఈ మూవీ శ్రీలీల కెరీర్ కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే టైటిల్ లో తన సినిమా రిలీజ్ అవ్వడం ఇష్టం లేదు అని ఎందుకు అన్నట్టు అనే డేట్ ఎవ్వరికైనా రావచ్చు. శ్రీలీల రిలీజ్ వద్దు అనుకుంటున్న సినిమా అది కాదు..

ఈ డిసెంబర్ 17 కి ‘ ఐ లవ్ యు ఇడియట్ ‘ అనే మరో సినిమా రిలీజ్ కాబోతుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్. నిజానికి ఇది పెళ్ళిసందD కంటే ముందు రిలీజ్ కావాల్సిన సినిమా అట. కానీ లాక్ డౌన్ వంటి కారణాల వల్ల ఆగిపోయింది. కానీ పెళ్ళిసందD లాటరీలో హిట్ అవ్వడం, తర్వాత క్రేజీ హీరోయిన్ అవ్వడం.. ఇప్పుడు మహేష్ బాబు వంటి బడా హీరో సినిమాల్లో నటించడంతో ..

ఆమె క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ ఇప్పుడు ఆ మూవీని విడుదల చేయబోతున్నారు. తనకు మంచి క్రేజ్ ఏర్పడిన ఇలాంటి టైంలో ఆ సినిమా రిలీజ్ అవ్వడం పట్ల శ్రీలీల ఇబ్బంది పడుతుందట.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus