కన్నడ సినిమా పరిశ్రమతో కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత టాలీవుడ్‌కి వచ్చిన తెలుగు అందం శ్రీలీల (Sreeleela) . తెలుగులో వరుస సినిమాలు చేసి ఇప్పుడు తమిళ, హిందీ సినిమా పరిశ్రమలపై దృష్టి సారించింది. అయితే గత కొన్ని నెలలుగా ముంబయిలోనే ఉంటోంది. దీంతో ‘శ్రీలీల ముంబయికి షిఫ్ట్ అయిపోయింది’, ‘బాలీవుడ్‌కి వెళ్లి మళ్లీ రాదా?’ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై శ్రీలీల స్పందించింది. దీంతో ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బాలీవుడ్‌కి నేను వెళ్లిపోవడమేంటి. అలాంటిదేమీ లేదు. నా సొంతింటిని నేనెలా మర్చిపోతాను. కన్నడ సినిమా తర్వాత నన్నిలా నిలబెట్టింది తెలుగు సినిమా పరిశ్రమనే. అయితే బలమైన పాత్రల కోసం ఇప్పుడు చూస్తున్నాను. ప్రేక్షకులు నన్నిప్పటి వరకు చూడని విధంగా వైవిధ్యభరితమైన పాత్రలు ఓకే చేసుకునే ఆలోచనలో ఉన్నాను. ఈ క్రమంలో వారికి కొత్తదనం పంచివ్వాలని కూడా అనుకుంటున్నారు. అందుకే ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే కన్నా.. ఒక్క మంచి చిత్రం ఇచ్చినా ఫర్వలేదు అనుకుంటున్నాను అని స్టార్ హీరోల్లా మాట్లాడింది.
శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్‌లో మూడు సినిమాల్లో నటిస్తోందని సమాచారం. అందులో ఒక్క సినిమా మాత్రం అధికారికంగా ప్రకటించారు. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తిక్ ఆర్యన్ హీరోగా ఓ సినిమా చేస్తోంది. ‘ఆషికి 3’ అనే పేరు పెడతారనే తొలుత వార్తలొచ్చినా.. ఇప్పుడు కొత్త పేరు ఓకే చేస్తున్నారట. ఇది కాకుండా ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కూడా చేస్తోంది. త్వరలోనే ఈ అనౌన్స్‌మెంట్ ఉంటుంది.
అలాగే ఓ యంగ్ డెబ్యూ హీరోతో ప్రాజెక్ట్ ఓకే చేసిందట. ఇక సౌత్ సంగతి చూస్తే.. పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటిస్తోంది. తమిళంలో శివ కార్తికేయన్‌తో ‘పరాశక్తి’ సినిమా ఉంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది వస్తాయి. హిందీ సినిమా కూడా అంతే అంటున్నారు.