Sreeleela: శ్రీలీలకు సినిమా కష్టాలు… పగోడికి కూడా రాకూడని చిక్కు!

స్టార్‌ హీరోయిన్‌ అవ్వడం కష్టం… స్టార్‌ హీరోయిన్‌ అయ్యాక ఆ స్టేటస్‌ను మెయింటైన్‌ చేయడం ఇంకా కష్టం. కావాలంటే దీనికి నిలువెత్తు నిదర్శనంగా ప్రస్తుతం టాలీవుడ్‌లో కనిపిస్తున్న ఏకైక నటి శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల చేతిలో తొమ్మిది సినిమాలు ఉన్నాయి. అదేంటి గత కొన్ని నెలలుగా ఈ తొమ్మిది నెంబరే చెబుతున్నారు అని అంటారా? అవును మరి ఆమె సినిమాల సంఖ్య అక్కడితో ఆగిపోయింది కాబట్టి. అంతేకాదు ఇప్పుడు శ్రీలీలకు అదే సమస్య అని అంటున్నారు.

‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌లో ప్రవేశించిన శ్రీలీల… ఆ తర్వాత ‘ధమాకా’ సినిమాతో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఆ తర్వాత ఆమె వరుస సినిమాలు ఓకే చేసేసింది. అలా అంతకుముందు చేసిన సినిమాలతో ఇప్పుడు కొత్త సినిమాల ఓకే చేయడంలో ఇబ్బంది పెడుతోంది అంటున్నారు. చేసిన సినిమాల్లో ఒకటి నెలాఖరుకు రిలీజ్‌ అవుతుండగా, మరొకటి దసరా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మిగిలినవి ఎప్పడు పూర్తవుతాయో, పూర్తయినవి ఎప్పుడు రిలీజ్‌ అవుతాయో తెలియడం లేదు.

రామ్‌ ‘స్కంద’ ఈ నెలాఖరకు వస్తుండగా, బాలకృష్ణ ‘భగవంత్‌ కేసరి’ వచ్చే నెలలో వస్తోంది. ఆ తర్వాతి నెలలో వైష్ణవ్‌ తేజ్‌ ‘ఆదికేశవ’ తీసుకొస్తున్నారు. మిగిలిన సినిమాలు ఆ తర్వాత వస్తాయి. అయితే మహేష్‌బాబు ‘గుంటూరు కారం’, పవన్‌ కల్యాణ్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’తోపాటు కొన్ని సినిమాల డేట్స్‌ తరచూ అడ్జస్ట్‌ చేస్తున్నారట. దీంతో కొత్త సినిమాలు ఏవైనా ఓకే చేద్దాం అంటే డేట్స్‌ క్లాష్‌ వస్తోందట. ఈ కారణంగా శ్రీలీల వరుసగా సినిమాలు వద్దనుకుంటోంది అని టాక్‌.

ఈ లెక్కల చిక్కులు కారణంగానే రవితేజ – గోపీచంద్‌ మలినేని సినిమాను వదులుకుందని చెబుతున్నారు. అలాగే విజయ్‌ దేవరకొండ సినిమా నుండి తప్పుకుంది అని చెబుతున్నారు. దీంతోపాటు మరో యువ హీరో సినిమా నుండి తప్పుకోవచ్చని ఓ టాక్‌ వినిపిస్తోంది. దీంతో శ్రీలీల స్టార్‌ స్టేషస్‌ నిలబెట్టుకోవడానికి కొత్త సినిమాలు వదిలేస్తోంది అనే టాక్‌ మొదలైంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus