Sree Mukhi: రోల్స్ రాయిస్ కొనాలన్నదే తన కోరిక అంటూ అసలు విషయం బయట పెట్టిన శ్రీముఖి?

  • August 16, 2022 / 09:16 AM IST

బుల్లితెర రాములమ్మగా ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి ప్రస్తుతం ప్రతి ఒక్క ఛానల్లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఒకప్పుడు ఈ విధంగా సుమ ప్రతి ఒక్క ఛానల్ లోని ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేసేది.అయితే ప్రస్తుతం ఈమె వరుస సినిమా ఈవెంట్లతో బిజీగా ఉండటం వల్ల ఆ స్థానాన్ని శ్రీముఖి కైవసం చేసుకుంది.

ఈ క్రమంలోనే ఈమె ఈటీవీ ప్లస్ లో జాతి రత్నాలు అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇక జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు ఇక్కడ కూడా సందడి చేయడంతో ఈ కార్యక్రమానికి కూడా విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమం 100వ ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకోనుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఇక ఈ కార్యక్రమం 100వ ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా, శ్రీముఖి మాత్రం ఏకంగా లక్షవ ఎపిసోడ్ అంటూ ఫీల్ అయింది.లక్ష ఎపిసోడ్ వరకు నాకు రోల్స్ రాయిస్.. ఇమాన్యుయేల్‌కు బెంజ్.. మా గుమాస్తా తాతకు తోపుడు బండి అంటూ ఇలా సెటైర్లు వేసుకుంటూ పోయింది. ఈ క్రమంలోనే ఈమె ఇలా అనటంతో తన లిస్టులో చాలా ఖరీదైన కార్లు ఉన్నాయని తెలుస్తుంది.

ఇప్పటికే శ్రీముఖి ఎంతో ఖరీదైన కార్లను కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే తనకు రోల్స్ రాయిస్ కారు కొనుక్కోవాలని కోరిక ఉన్నట్లు ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. మొత్తానికి శ్రీముఖి ఫేవరెట్ కారు గురించి ఇలా చెప్పడంతో మరి కోట్ల విలువ చేసే రోల్స్ రాయిస్ కారును శ్రీముఖి ఎప్పుడు కొనుగోలు చేస్తారో వేచి చూడాలి. మొత్తానికి శ్రీముఖి కోరికలు మామూలుగా లేవని చాలా కాస్ట్లీ కోరికలే ఉన్నాయని ఈ ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus