Bigg Boss 5 Telugu: శ్రీరామ్ చంద్ర ఈమాట ఎందుకు అన్నాడో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ బాగా ఘర్షణపడ్డారు. రక్తాలు వచ్చుకుని కొట్టుకునేంత వరకూ వెళ్లిపోయారు. ఈసీజన్ లో నెక్ట్స్ లెవల్ టాస్క్ ని చూపించారు. అంతేకాదు, టాస్క్ లో ఈగల్స్ టీమ్ లీడర్ అయిన శ్రీరామ్ చంద్ర ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్లుగా గేమ్ ఆడాడు. అలాగే ఉల్ఫ్ టీమ్ నుంచి మానస్ కూడా తన స్టైల్లో గేమ్ ఆడాడు. ఎక్కడిక్కడ అందర్నీ కన్విన్స్ చేస్కుంటూ అందర్నీ బ్యాలన్స్ చేస్కుంటూ గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు. ఇక్కడ గేమ్ లో రవికి శ్రీరామ్ చంద్రకి చిన్నపాటి ఘర్షణ అయ్యింది. దీనికి కారణం చెప్తూ రవి శ్రీరామ్ ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే బిగ్ బాస్ మళ్లీ బజర్ మోగేవరకూ గేమ్ ప్రారంభం కాదు అని చెప్పాడో అప్పుడు హౌస్ మేట్స్ రిలాక్స్ అయిపోయారు.

అప్పుడే రవి ఇంకా శ్రీరామచంద్ర పర్సనల్ గా మాట్లాడుకున్నారు. నైట్ కూల్ గా యాపిల్ తింటూ తన గేమ్ ఎలా ఉంటుందో రవికి చెప్పే ప్రయత్నం చేశాడు. రవి నేను నిన్ను ఎజెమ్షన్ చేయలేదు అని చెప్తూ.. నేను నీవిషయంలో చాలా కూల్ గా ఉన్నాను అన్నాడు.. నేను ఒక టీమ్ కి కెప్టెన్ ని, నా టీమ్ ఒక ఓపీనియన్ కి వస్తే అది నేను ముందుపెట్టటం అనేది నా బాధ్యత. ఇందులో నామీద నీ పర్సనల్ ఓపీనియన్ ఏంటి అంటూ ప్రశ్నించాడు. నువ్వేంటి.. నా టీమ్ తో నేను ఫైట్ చేసి ఇది రైట్ అని చెప్పి టీమ్ కి నచ్చజెప్పాలని అనుకుంటున్నావా.. ఇలా చేయమని చెప్తున్నావా అంటూ మాట్లాడాడు..

ఇక్కడే రవి నేను అలాగ అన్నానా అంటూ మాట్లాడాడు. ఈ రెస్పెక్ట్ ఏంటి బ్రో మద్యలో అంటూ శ్రీరామ్ రవికి క్లాస్ పీకే ప్రయత్నం చేశాడు. నా ఓపీనియన్ అది అంటుంటే, నీ ఓపీనియన్ నీదగ్గర పెట్టుకో రవి.. నేను అడగలేదు కదా అంటూ మాట్లాడాడు. నేను చెప్పలేదు కదా అని రవి అనేసరికి.. నామినేషన్స్ లో చెప్పుకో అంటూ శ్రీరామ్ మాట్లాడాడు. ఇక్కడే రవి నామినేషన్స్ లో ఏం చెప్పాలో నాకు తెలుసు బ్రో అని అన్నాడు. దీనికి శ్రీరామ్ చంద్ర నువ్వు సేఫ్ గేమ్ ఆడాలనుకుంటే సేఫ్ గేమ్ ఆడు , నీకిష్టమున్నట్లు ఆడు.. కానీ నాతో మైండ్ గేమ్స్ ఆడకు అంటూ అనేసిరికి రవి సైలెంట్ అయిపోయాడు.

శ్రీరామ్ చంద్ర ఇక్కడే తన మనసులో మాటల్ని బయటకి చెప్పాడు. నువ్వూ లోబో సేఫ్ గేమ్ ఆడుతున్నారు. నేను ఇది నామినేషన్స్ అప్పుడు కూడా చెప్పచ్చు. కానీ ఇప్పుడే చెప్తున్నా నేను ఇక్కడికి మనీకోసం రాలేదు. ఒకవేళ వాళ్లు 50లక్షలు ఇచ్చి వెళ్లమంటే, నేను ముఖాన కొడతా అంటూ శ్రీరామ్ చంద్ర మాట్లాడాడు. అందరితోటి తెలుగు వాళ్లతోటి రిలేషన్ షిప్ బిల్డ్ చేస్కోవడానికి ఇక్కడికి వచ్చాను. అని తను ఆటలో ఎంత క్లియర్ గా ఉన్నానో నాకు తెలుసు అన్నట్లుగా చెప్పాడు శ్రీరామ్ చంద్ర.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus