పవన్ కళ్యాణ్ ని పబ్లిక్ గా తిట్టడమే కాకుండా ఆయన అభిమానుల్ని రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టి కావాలని వాళ్ళతో తిట్టించుకొని తాను మొదలెట్టిన మహా పోరాటాన్ని తానే స్వయంగా నీరుగార్చుకున్న శ్రీరెడ్డికి ఇంకా సరదా తీరినట్లు లేదు. అందుకే ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పెట్టుకొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ “భరత్ అనే నేను” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని డిక్లేర్ చేసి సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చేలా చేస్తే.. శ్రీరెడ్డి మాత్రం నిన్న రాత్రి “భరత్ అనే నేను చెత్త సినిమా, కొరటాల డైరెక్షన్ బాలేదు, మహేష్ సింగిల్ ఎక్స్ ప్రెషన్ ఏంటి?” అంటూ ఒక పెద్ద పోస్ట్ పెట్టింది.
అలా పోస్ట్ పొట్టినా పది నిమిషాల్లోనే సూపర్ స్టార్ అభిమానులందరూ శ్రీరెడ్డిని ట్విట్టర్ సాక్షిగా ఆడుకోవడం మొదలెట్టారు. మొదట్లో పెద్దగా పట్టించుకోని శ్రీరెడ్డి.. బూతుల జోరు కాస్త ఎక్కువవ్వడంతో ఏం చేయాలో తోచక ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది. పెట్టిన పోస్ట్ డిలీట్ చేసినంత మాత్రాన జనాలు ఊరుకుంటారా చెప్పండి. మరి మొన్నటివరకూ మీ అభిమానుల్ని కంట్రోల్ చేయండి అంటూ పవన్ కళ్యాణ్ ని నిలదీసిన శ్రీరెడ్డి.. ఇప్పుడు మహేష్ బాబుకి ఏమని సలహా ఇస్తుందో చూడాలి.