Chiranjeevi: నాగబాబు జోక్ మర్చిపోయారా.. శ్రీరెడ్డి కామెంట్స్ వైరల్..?

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కోలీవుడ్ కు మకాం మార్చిన శ్రీరెడ్డి అక్కడ ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో ఉన్న శ్రీరెడ్డి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ టాలీవుడ్ సినీ ప్రముఖులపై విమర్శలు చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా చిరంజీవికి వైసీపీలో కీలక పదవి దక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం గురించి శ్రీరెడ్డి వీడియోలో స్పందిస్తూ చిరంజీవి సరైన పర్సన్ కాదని చిరంజీవి పార్టీని నిలబెట్టుకోలేకపోయారని ఇచ్చిన పదవిని కూడా సరిగ్గా వినియోగించుకోలేకపోయారని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

చిరంజీవి కళావంతుల ఫ్యామిలీకి చెందిన వారని ఆయన కాపు కులానికి చెందిన వ్యక్తి కాదని శ్రీరెడ్డి అన్నారు. చిరంజీవి ఫేక్ కాపులు అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. వైసీపీని నమ్ముకున్న కాపు వ్యక్తికి పదవిని ఇవ్వాలని శ్రీరెడ్డి సూచనలు చేశారు. మరో పోస్ట్ లో పల్లకి మోసేవాడి కష్టాన్ని వదిలేసి దారిన పోయే అనామకుడిని శిఖరం మీద కూర్చోపెట్టడం అంటే కనకపు సింహాసనం మీద శునకం కూర్చుండబెట్టినట్టు అనే జోక్ జగన్ మీద నాగబాబు వేయించాడని శ్రీరెడ్డి పేర్కొన్నారు.ఆ అవమానాన్ని మరిచిపోయి జగనన్న తప్పు చేస్తున్నాడా..? అంటూ శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

శ్రీరెడ్డి చేసిన పోస్టులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండగా ఆ పోస్టుల విషయంలో కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం చిరంజీవి వైసీపీలో ఎప్పటికీ చేరరని శ్రీరెడ్డి చిరంజీవి గురించి ఏ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా కామెంట్లు చేశారో అర్థం కావడం లేదని చెబుతున్నారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus