బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో పార్టిసిపెంట్స్ అందరూ ఎమోషనల్ అయిపోతున్నారు. బేబీ సిసింద్రీ టాస్క్ తర్వాత రాత్రి తమ లైఫ్ బేబీతో ఉన్న అనుబంధం గురించి చెప్పమని బిగ్ బాస్ అడిగాడు. దీంతో హౌస్ మేట్స్ తమ స్టోరీలని చెప్తూ హౌస్ మేట్స్ అందర్నీ ఏడిపించేశారు. శ్రీసత్య కూడా తన స్టోరీని హౌస్ మేట్స్ తో పంచుకుంది. తను చేసిన చిన్న మిస్టేక్ వల్ల అమ్మకి స్ట్రోక్ వచ్చిందని, ఆ టైమ్ లో సూసైడ్ చేస్కుంటానని అనడం నా తప్పే అంటూ ఎమోషనల్ అయిపోయింది.
అందుకే తల్లిదండ్రులు ఏది చెప్పినా కూడా పిల్లల మంచి కోసమే అని తప్పకుండా వినండి అంటూ సలహా ఇచ్చింది. పిల్లలు ఏదైనా చేస్తే తట్టుకునే శక్తి అమ్మా నాన్నలకి ఉండదు. మా అమ్మ స్ట్రోక్ వచ్చిన తర్వాత హాస్పిటల్ లో ఎవరూ లేరు. నేను నాన్న ఇద్దరమే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత అమ్మ మంచం మీద చూసినప్పుడల్లా నాకు ఏడుపు వస్తునే ఉంటుంది. మా నాన్న ఒక్కరే మా అమ్మకి హెల్ప్ చేస్తుంటారు.
ఆమెకి స్నానం చేయించాలన్నా, అన్నం పెట్టాలన్నా, డైపర్స్ మార్చాలన్నా కూడ ఆయనే దగ్గరుండీ చూసుకుంటారు. అలాంటి సిట్యువేషన్ లో ఆర్ధిక ఇబ్బందులు కూడా ఉంటాయి. నిజానికి నేను ఈ ఫీల్డ్ లోకి రాకముందు నుంచే నా పరిస్థితి దారుణంగా ఉండేదంటూ చెప్పి బాధపడింది. అంతేకాదు, వాళ్ల అమ్మని తలుచుకున్నప్పుడల్లా తనకి బాధగా ఉంటుందని, నా వల్లే అమ్మ మంచాన పడిందా అనిపిస్తుందని చాలా ఎమోషనల్ అయిపోయింది శ్రీసత్య. అర్ధరాత్రి వరకూ తోటి హౌస మేట్స్ తో తన బాధని చెప్పుకుని మరీ ఏడ్చింది.
శ్రీసత్య తన స్టోరీ చెప్పేటపుడు అభినయశ్రీ, శ్రీహాన్ , అర్జున్ ఇలా అందరూ కూడా ఎమోషనల్ గా బాగా బాధపడ్డారు. రాత్రి బాలాదిత్య దగ్గర కూడా తన గురించి చెప్పుకుంటూ బాధపడింది శ్రీసత్య. హౌస్ లో అందరూ తమ ఎమోషనల్ స్టోరీలని షేర్ చేసుకున్నారు. బిగ్ బాస్ హౌస్ కన్నీళ్లతో నిండిపోయింది. అందరూ ఏడుస్తూనే భారమైన గుండెలతో నిద్రపోయారు. ఈ ఎపిసోడ్ సీజన్స్ అన్నింటికంటే కూడా హైలెట్ గా నిలిచిపోబోతోంది. ఇప్పటికే హౌస్ మేట్స్ ఎమోషనల్ స్టోరీలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!