శ్రీవిష్ణు హీరోగా లవ్లీ సింగ్ హీరోయిన్ గా అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాలి సంపత్’. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్’ మరియు ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ల పై ఎస్.కృష్ణ, హరీష్ పెద్ది,సాహు గరపాటి లు కలిసి నిర్మించారు.అపజయమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే ను కూడా అందించడం విశేషం. దాంతో ఈ చిత్రం పై మంచి అంచనాలే నెలకొన్నాయి.
దాంతో మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. వాటి వివరాలను ఓ సారి పరిశీలిస్తే :
నైజాం
2.00 cr
సీడెడ్
1.00 cr
ఉత్తరాంధ్ర
3.00 cr
ఏపీ+తెలంగాణ (టోటల్)
6.00 cr
రెస్ట్ ఆఫ్ ఇంఫియా + ఓవర్సీస్
0.50 cr
వరల్డ్ వైడ్ టోటల్
6.50 cr
‘గాలి సంపత్’ చిత్రానికి 6.5కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. శ్రీవిష్ణు కెరీర్లో ఇదే హైయెస్ట్ బిజినెస్. కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 7కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా ‘శ్రీకారం’ ‘జాతి రత్నాలు’ వంటి క్రేజీ సినిమాలు కూడా ఉన్నాయి. కాబట్టి హిట్ టాక్ వస్తే తప్ప.. బ్రేక్ ఈవెన్ అవ్వడం అంత ఈజీ ఏమీ కాదనే చెప్పాలి.