ఫిబ్రవరి 24వ తారీఖు రాత్రి 10.30 నిమిషాలకు మరణించిన అతిలోకసుందరి శ్రీదేవి మృతదేహం నిజానికి ఫిబ్రవరి 25 మధ్యాహ్నం కల్లా ముంబై చేరుకోవాల్సి ఉన్నప్పటికీ.. శ్రీదేవి మృతిని దుబాయ్ పోలీసులు ఇన్విస్టిగేట్ చేసిన తీరు, బోణీకపూర్ ను ప్రశ్నించిన విధానం..
అన్నిటికీ మించి శ్రీదేవి మృతదేహాన్ని ఇండియా పంపేందుకు దుబాయ్ ప్రభుత్వం సరైన రీతిలో సహకరించకపోవడం, ఆఖరికి ప్రధానమంత్రి పేషీ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లినా కూడా దుబాయ్ ప్రభుత్వం కేస్ క్లోజ్ అయ్యేవరకు స్పందించకపోవడంతో.. అంబానీ ప్రయివేట్ జెట్ దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేస్తున్నా కూడా ఫలితం లేకపోయింది. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, సాండల్ వుడ్ కి చెందిన తారాలోకమంతా ముంబైలో శ్రీదేవి మృతదేహం కోసం వేచిచూస్తున్నప్పటికీ.. దుబాయ్ ప్రభుత్వం చాలా సిన్సియర్ గా వ్యవహరించి శ్రీదేవి కుటుంబాన్ని ఇబ్బందికి గురిచేసింది.
అయితే.. ఎట్టకేలకు శ్రీదేవి మృతదేహాన్ని ఇండియా పంపించారు దుబాయ్ పోలీసులు. కొద్ది గంటల క్రితమే శ్రీదేవి పార్థివ దేహాన్ని ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుండి ముంబైలోని శ్రీదేవి నివాసానికి తీసుకువచ్చారు. రేపు మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో శ్రీదేవి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం వరకూ అభిమానులు, బంధువుల కోసం ఇంటివద్దే ఉంచుతారు. ఈమేరకు శ్రీదేవి భర్త బోణీకపూర్, పిల్లలి జాన్వీ-ఖుషీ ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ సైతం రిలీజ్ చేశారు.