ఎన్టీఆర్, బాబీ మూవీలో నటించనున్న శ్రీదేవి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27 వ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడు అందుకుంది. ఈనెల 26 నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీలో టెక్నీషియన్లు, ఆర్టిస్టులను ఎంపిక చేసే పనిలో డైరక్టర్ బాబీ బిజీగా ఉన్నారు.  ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తొలిసారిగా తారక్ నటిస్తున్న ఈ ఫిల్మ్ ని వందకోట్ల బడ్జెట్ నిర్మించాలని నందమూరి కళ్యాణ్ రామ్ భావిస్తున్నారు. అందుకే ఏ విషయంలోను డైరక్టర్ కాంప్రమైజ్ కావడం లేదు. యంగ్ టైగర్ మూడు పాత్రల్లో మెప్పించనున్న ఈ ఫిల్మ్ లో కీలక పాత్రకు అతిలోక సుందరి శ్రీదేవి అయితే బాగుంటుందని ఆయన భావించారు. అందుకోసం బాబీ రీసెంట్ గా శ్రీదేవిని కలిసినట్లు ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.

ఎప్పటినుంచో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న ఆమెకు ఈ స్టోరీ బాగా నచ్చిందని సమాచారం. ప్రాజెక్ట్ పేపర్ పై సంతకం చేసిన వెంటనే అనౌన్స్ చేయడానికి నిర్మాత కళ్యాణ్ రామ్ సిద్ధంగా ఉన్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ‘నట విశ్వరూప’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, అనుపమ పరమేశ్వరన్, మంజిమ మోహన్ హీరోయిన్స్ గా నటించనున్నారు. వీరి అందాలకు తోడు శ్రీదేవి సొగసు ఈ సినిమాకు ప్లస్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus