అతిలోక సుందరి శ్రీదేవి భౌతికంగా దూరమై 5 సంవత్సరాలు కావస్తున్నా.. ఆమె జ్ఞాపకాలు ఇంకా భారతీయ సినీ అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి.. ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో కాలు జారి 2018 ఫిబ్రవరి 24న తన 54వ ఏట ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారామె. బాలనటిగా సినీ రంగప్రవేశం చేసి.. కథానాయికగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో అద్భుతమైన చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్‌గా నంబర్ వన్ సింహాసనాన్ని అధిష్టించారామె..
శ్రీదేవి తర్వాత ఏ కథానాయిక కూడా ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదంటే.. ప్రేక్షకుల మనసుల్లో ఆమె స్థానం ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.. రెండు తరాల హీరోలతో నటించిన రికార్డ్ కూడా ఆమె నెలకొల్పినదే.. ఇప్పుడు మనం పాన్ ఇండియా అంటున్నాం కానీ శ్రీదేవి అప్పట్లోనే పాన్ ఇండియా అగ్ర కథానాయికగా ఆదరణ దక్కించుకున్నారు. కెరీర్ పీక్‌లో ఉండగానే అప్పటికే పెళ్లి అయ్యి పిల్లలున్న నిర్మాత బోనీ కపూర్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు.
పెళ్లి, పిల్లలతో ఆమె సినిమాలకు దూరమయ్యారు.. దాదాపు 15 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయి పాత్రలో శ్రీదేవి రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ.. ‘ఇంగ్లీష్ – వింగ్లీష్’.. ఎప్పటిలానే తన నేచురల్ పర్ఫార్మెన్స్, అలరించే హావభావాలతో ఆకట్టుకున్నారు. సాధారణ మధ్య తరగతి మహిళగా.. ఛాలెంజింగ్ క్యారెక్టర్లో ఆమె నటన అమోఘం.. గౌరి షిండే డైరెక్ట్ చేసిన ఈ ఫిలిం ముందుగా 2012 సెప్టెంబర్ 14న టొరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. 2012 అక్టోబర్ 5న రిలీజ్ చేశారు. తెలుగులోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది..
హిందీలో అమితాబ్ బచ్చన్, తమిళంలో అజిత్ అతిథి పాత్రల్లో మెరిశారు. ఇప్పుడీ చిత్రం చైనాలో విడుదల కానుంది. ప్రస్తుతం చైనీస్ భాషకి సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 24న చైనా దేశంలో ‘ఇంగ్లీష్ – వింగ్లీష్’ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ వదిలిన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ తేదీ చూసి శ్రీదేవి ఫ్యాన్స్, మూవీ లవర్స్ భావోద్వేగానికి గురవుతున్నారు.. ఎందుకంటే ఫిబ్రవరి 24నే శ్రీదేవి కన్నుమూశారు. ఆమె వర్థంతిని పురస్కరించుకుని చైనాలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!