Srikanth: అడవుల్లో, చెప్పులు కూడా లేకుండా… ‘కోటబొమ్మాళి’ శ్రీకాంత్‌ ముచ్చట్లు ఇవే

  • November 24, 2023 / 12:38 PM IST

సినిమా నటులు రకరకాల పాత్రలు చేస్తుంటారు కదా.. ఏ పాత్ర చేశాక సంతృప్తి చెందుతారు అని అడిగితే.. సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి పాత్రా గతంలో చేసిన పాత్రకు భిన్నంగా ఉంటుంది. కొంతమంది నటులు అయితే ఒకే తరహా పాత్రలు చేస్తుంటారు కానీ… కొందరు మాత్రం ఏ రెండు పాత్రలూ ఒకేలా ఉండకుండా చూసుకుంటారు. ఇదే విషయాన్ని సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌ను అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

శ్రీకాంత్‌ అనగానే మనకు తొలుత సాఫ్ట్‌ పాత్రలే గుర్తొచ్చేవి. కుటుంబ కథలు, ప్రేమకథలు, భార్యాభర్తల సినిమాలు ఎక్కువగా చేసేవారు. అయితే ఆ తర్వాత ఆయన మాస్‌ సినిమాలవైపు వచ్చారు. మాస్‌ సినిమా అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే పాత్ర పోలీసు. ఎందుకంటే అందులో ఉన్నంత మాస్‌ ఇంకెందులోనూ ఉండదు అని మన టాలీవుడ్‌ జనాల నమ్మకం. తాజాగా ఆయన మరో పోలీసు కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అదే ‘కోటబొమ్మాలి పీఎస్‌’. ఈ సినిమా విడుదల సందర్భంగానే పాత్రలు – సంతృప్తి అనే విషయంలో మాట్లాడాడు.

‘ఖడ్గం’ సినిమా తర్వాత తనకు పోలీసు పాత్రలు సెంటిమెంట్‌గా మారాయన్న (Srikanth) శ్రీకాంత్‌.. ‘కోటబొమ్మాలి పీఎస్‌’లో పరుగులు పెట్టే కథ, కథనాలు ఉంటాయని, అవి ఉత్కంఠకి గురి చేస్తాయని చెప్పారు. కథానాయకుడిగా… కీలక పాత్రల్లోనూ నటిస్తున్నారు కదా… ఎలా ఉంది మీ జర్నీ అని అడిగితే… కథానాయకుడిగా బిజీగా ఉన్నప్పుడే ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేశానని, ఇదేం తనకు కొత్త కాదు అని చెప్పారు.

అయితే హీరోగా సరైన విజయాలు లేనప్పుడు ‘అఖండ’ సినిమాలో కీలక పాత్ర చేశానని నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. మరి మీ దశాబ్దాల నట ప్రయాణం సంతృప్తినిచ్చిందా అని అడిగితే… నటులకు సంతృప్తి ఉండదు, కొత్తగా ఓ పాత్ర వచ్చిందంటే మళ్లీ ఎలా మెప్పించగలం అనే భయాలు వెంటాడుతుంటాయి అని చెప్పారు. శ్రీకాంత్‌ ప్రస్తుతం రామ్‌చరణ్‌ – శంకర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’, ఎన్టీఆర్‌ – కొరటాల శివ ‘దేవర’ సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే వాళ్ల అబ్బాయి రోషన్‌ పాన్‌ ఇండియా సినిమా ‘వృషభ’లో కీలక పాత్ర చేస్తున్నాడు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus