మరోసారి కుటుంబ కథ చిత్రం చేయనున్న శర్వానంద్.!

కొత్త బంగారులోకం సినిమాతో డైరక్టర్ గా మంచి మార్కులు అందుకున్న శ్రీకాంత్ అడ్డాల .. ఆ తర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ హాయిగా చూసే సినిమాలను తెరకెక్కించిన ఈయన మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం తీశారు. 2016 లో వచ్చిన ఈ మూవీ నిరాశపరిచింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఓ కథని సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందులో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధాన్ని కొత్తగా చూపించనున్నట్లు సమాచారం.

ఈ స్టోరీని శర్వానంద్ కి చెప్పగా అతను ఒకే చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు.  దీనిని గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం శర్వానంద్ రెండు సినిమాలు చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న పడి పడి లేచే మనసు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో  డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఈ షూటింగ్ మొదటి షెడ్యూల్ విశాఖలో జరిగింది. ఆ తర్వాత షెడ్యూల్ కాకినాడ పోర్టులో జరగనుంది. ఈ రెండు సినిమాల తర్వాత శ్రీకాంత్ అడ్డాల మూవీ పట్టాలెక్కనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus