బ్రహ్మోత్సవం తర్వాత నానితో సినిమా చేయనున్న శ్రీకాంత్ అడ్డాల

కొత్త బంగారులోకం.. ముకుంద .. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఈ సినిమాలు చూస్తే శ్రీకాంత్ అడ్డాల శైలి ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. వైలెన్స్ కి దూరంగా… కుటుంబ అనుబంధాలకు దగ్గరగా అతని కథలు ఉంటాయని అర్ధమవుతాయి. రెండేళ్లక్రితం మహేష్ బాబుతో తీసిన బ్రహ్మోత్సవం కూడా ఉమ్మడి కుటుంబం కాన్సెప్ట్ మీద సాగుతుంది. ఈ సినిమా విజయం సాధించకపోవడంతో మంచికథ కోసం చాలా రోజుల సమయం తీసుకున్నారు. స్క్రిప్ట్ సిద్ధం కావడంతో సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం శ్రీకాంత్ అడ్డాల నేచురల్ స్టార్ నాని తో సినిమా చేయబోతున్నట్టు తెలిసింది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మితం కానున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. నాని, నాగార్జునతో కలిసి  దేవదాస్ గా వచ్చి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు జెర్సీ మూవీ షూటింగ్ కి సిద్ధమవుతున్నారు.  క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాని మూడు షేడ్స్ చూపించనున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల మూవీ కోసం డేట్స్ కేటాయించినట్లు సమాచారం. నానికి నేచురల్ స్టార్ అని పేరుంది. అలాగే  శ్రీకాంత్ అడ్డాలకు సహజమైన కథలను ఎంచుకుంటారని పేరుంది. మరి వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకునే మూవీ అత్యంత సహజంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus