‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీకాంత్ అడ్డాల.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’, ‘బ్రహ్మోత్సవం’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లను తెరకెక్కించాడు. టాలీవుడ్ లో ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్లలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. ఇప్పటివరకు కుటుంబ కథా చిత్రాలను రూపొందించిన ఆయన ‘అసురన్’ రీమేక్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడని తెలిసినప్పుడు అందరూ షాకయ్యారు. అసలు ఆ కాన్సెప్ట్ ను డీల్ చేయగలడా..? అనే సందేహాలు కూడా చాలా మందిలో కలిగాయి. ఇంకా ఈ రీమేక్ రిలీజ్ కాకుండానే ఇప్పుడు మరో రీమేక్ ఆయన చేతికొచ్చినట్లు సమాచారం.
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ‘కర్ణన్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇటీవల ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాను అన్ని భాషలకు చెందిన వారు ఎగబడి చూశారు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ సినిమాను తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేయనున్నాడు. ఈ కథను డీల్ చేసే దర్శకుడి కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ అడ్డాలను సంప్రదించినట్లు తెలుస్తోంది. ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ను ఆయన బాగా డీల్ చేశారనే టాక్ రావడంతో బెల్లంకొండ ఫస్ట్ ఆప్షన్ గా శ్రీకాంత్ అడ్డాలను ఎన్నుకున్నట్లు సమాచారం.
సినిమా తీసి, ఫస్ట్ కాపీ ఇచ్చేలా ఓ ప్యాకేజీలా మాట్లాడుకొని డీల్ క్లోజ్ చేయాలని బెల్లంకొండ భావిస్తున్నాడు. అయితే శ్రీకాంత్ అడ్డాల మాత్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. ‘నారప్ప’ సినిమా విడుదలై రిజల్ట్ వచ్చేవరకు నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించకూడదని అనుకుంటున్నాడు. ఒకవేళ ‘నారప్ప’ సినిమా సక్సెస్ అయితే.. రీమేక్ కథలను హ్యాండిల్ చేయగలడనే పేరొస్తుంది. కానీ ‘కర్ణన్’ లాంటి కాంట్రవర్సియల్ కాన్సెప్ట్ ను ఎలాంటి వివాదాలు రాకుండా తీయడమనేది పెద్ద ఛాలెంజ్. మరి ఈ విషయంలో శ్రీకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి!
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!