బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అఖండ’ చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో విలన్ గా శ్రీకాంత్ నటించడం ఆసక్తిని పెంచే అంశం. ‘అఖండ’ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న శ్రీకాంత్ ఈ సినిమా గురించి అలాగే అతని పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. “నా కెరీర్ ప్రారంభంలోనే విలన్ గా చేశాను. అటు తర్వాత హీరోగా మారి ఫ్యామిలీ సినిమాలు చేశాను. ఆ సినిమాలు చేస్తున్నప్పుడు కూడా మిగిలిన హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చాను.
ఉదాహరణకి ‘సంక్రాంతి’ ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ వంటి సినిమాలు. తర్వాత మళ్ళీ విలన్ గా మారి ‘యుద్ధం శరణం’ సినిమా చేశాను. అది పెద్దగా ఆడలేదు. ఆ సినిమా చేసే ముందు బోయపాటి శ్రీను గారు ‘మీరు కంగారు పడి విలన్ రోల్స్ చేసెయ్యకండి. నేను మీ కోసం మంచి పాత్ర సిద్ధం చేస్తాను’ అని చెప్పారు. అప్పటికే ఆయనతో ‘సరైనోడు’ చేసిన అనుబంధం ఉంది. ఇక బాలకృష్ణగారితో నేను చేస్తున్న రెండో సినిమా ఇది.
‘శ్రీరామరాజ్యం’ సినిమాలో ఆయన రాముడి పాత్రని పోషిస్తే నేను లక్ష్మణుడిగా నటించాడు. ఈ సినిమాలో మాత్రం రావణాసురిడి పాత్రలాంటి పాత్రను పోషించాను. అయితే ‘ఈ సినిమా హిట్ అయితే నీకు వరుసగా అవకాశాలు వస్తాయి. వచ్చాయి కదా అని ఏది పడితే అది ఒప్పేసుకోకు. ఏ సబ్జెక్టులు చెయ్యాలో నేను చెబుతాను అవి చెయ్యి. అలాగే హీరోగా కూడా అవకాశాలు వస్తే వదిలిపెట్టకు” అంటూ బాలకృష్ణగారు ముందుగానే నాకు వార్ణింగ్ ఇచ్చారు.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?