Srikanth Daughter: చీరకట్టులో శ్రీకాంత్ కూతురు.. వైరల్ అవుతున్న ఫోటో!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో శ్రీకాంత్ ఒకరు ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీకాంత్ ప్రస్తుతం తెలుగు తమిళ భాష చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక శ్రీకాంత్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన నటి ఊహను ప్రేమించే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఇప్పటికే వీరు పెద్ద కుమారుడు రోషన్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగగా మరో కుమారుడు రోహన్ ప్రస్తుతం చదువుతూ ఉన్నారు.

ఇక ఈయనకు మేద అనే ఒక కుమార్తె కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ అమ్మాయి ప్రస్తుతం కెనడాలో చదువుతున్నారు అయితే ఇటీవల శ్రీకాంత్ కుటుంబ సభ్యులందరూ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీకాంత్ కుటుంబ సభ్యులందరూ స్వామివారిని దర్శించుకున్నారు. అయితే దర్శనం అనంతరం శ్రీకాంత్ ఫ్యామిలీ ఆలయం బయట సందడి చేయగా అభిమానులు పెద్ద ఎత్తున వీరిని చూసి ఫోటోల కోసం ఎగబడ్డారు.

ఇక ఊహ తన కుమార్తె అభిమానులతో సెల్ఫీలు దిగి వారిని ఆనందపరిచారు. అయితే శ్రీకాంత్ (Srikanth) కూతురు మేధా మాత్రం హీరోయిన్లను మించిన అందంతో ఎంతో అందంగా పద్ధతిగా కనిపించారు.స్వామివారి దర్శనం కోసం ఈమె చీరకట్టులో సాంప్రదాయపద్ధంగా గుడికి వచ్చారు. ప్రస్తుతం మేధా ఫోటోలు చూసిన వారందరూ కూడా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరని కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus