Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి!
- September 17, 2026 / 12:09 PM ISTByFilmy Focus Desk
రామ్‌చరణ్‌ను ఇబ్బంది పెడితే.. చిరంజీవి గిఫ్ట్ ఇవ్వడమేంటి? ఇలా ఎక్కడైనా జరుగుతుందా? అని అనుకుంటున్నారా.. మీ ప్రశ్న కరెక్టే. కానీ ఇది జరిగింది. ఎందుకంటే ఆ ఇబ్బంది కారణంగానే చరణ్‌లోని బెస్ట్ బయటకు వచ్చింది. ఆయనకు ఓ బ్లాక్‌బస్టర్ పడింది. ఇండస్ట్రీకి చరణ్ సత్తా ఏంటి అనేది కూడా తేలింది. అంతేకాదు ఆ కష్ట పెట్టడం వెనుక ఉన్న కారణం, కష్టమే ఆ దర్శకుడికి చిరంజీవితో సినిమా చేసే అవకాశం రావడంలో కీలక పాత్ర పోషించింది. ఇక్కడ ఆ దర్శకుడు అంటే శ్రీకాంత్ ఓదెల.
Srikanth Odela
అవును నానికి ‘దసరా’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చి.. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే ‘ది ప్యారడైజ్’తో చేయడానికి రెడీ అవుతున్న శ్రీకాంత్ ఓదెల గురించి చెబుతున్నది. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు కొన్ని చెప్పారు. అందులో ‘రంగస్థలం’ నాటి ముచ్చట్లు ఉన్నాయి. రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన ఆ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వ విభాగంలో కీలకంగా వ్యవహరించారు అనే విషయం తెలిసిందే.

‘‘రంగస్థలం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో శ్రీకాంత్ ఓదెల కాస్ట్యూమ్స్, షూటింగ్ సమయంలో చరణ్‌ను ఇబ్బంది పెట్టారట. తెల్లవారుజామున 3.30కు నిద్రలేపేసేవారట.. అయినా చరణ్ ఒక్క మాట కూడా అనలేదట. సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ప్రత్యేక బహుమతి కూడా ఇచ్చారట. ఆ సినిమా మొత్తం చరణ్ మెడలో ఉన్న హనుమంతుడి లాకెట్టే ఆ గిఫ్ట్. ఆ లాకెట్‌ను చిరంజీవి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి డిజైన్ చేయించారట.
సినిమా షూటింగ్ అయ్యాక చరణ్ దాన్ని ఇచ్చి ‘ఇకపై ఇది నువ్వు వేసుకో’ అని అన్నారట. ఆరోజు నుండి ఇప్పటివరకూ ఆ లాకెట్ ఆయన మెడలో నుండి తీయలేదట. ఆ మధ్య చిరంజీవితో సినిమా అనౌన్స్ అయిన సందర్భంలో శ్రీకాంత్ ఓదెల షేర్ చేసిన ఫొటో చూస్తే ఆయన మెడలో ఆ లాకెట్ కనిపిస్తోంది కూడా. ఇక్కడ చిరంజీవి గిఫ్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఆ లాకెట్ చిరంజీవి చేయించిందే. ఇది పక్కన పెడితే తనను దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వడం అనేది అన్నింటి కంటే పెద్ద గిఫ్ట్ కదా. కథ నచ్చడంతో పాటు సినిమా కోసం శ్రీకాంత్ ఎంత కష్టపడతారో చిరంజీవికి రామ్‌చరణ్ చెప్పకుండా ఉంటాడా?
















