Akhanda Movie: అఖండ సీక్రెట్స్ రివీల్.. వేరే లెవెల్ అట..!

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో అఖండ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తన సినిమాలలో విలన్ లను క్రూరంగా చూపించే బోయపాటి శ్రీను అఖండ సినిమాలో శ్రీకాంత్ ను విలన్ గా చూపిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ అఖండ సినిమా గురించి మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో తాను విలన్ వరదరాజులు అనే పాత్రను పోషిస్తున్నానని శ్రీకాంత్ తెలిపారు. బాలయ్య ఈ సినిమాలో రెండు పాత్రల్లో మాత్రమే నటిస్తున్నారని రెండు కంటే ఎక్కువ పాత్రలలో బాలయ్య నటిస్తున్నట్టు వస్తున్న వార్తలలో నిజం లేదని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

సినిమాలో బాలయ్య అఘోర పాత్ర ఒక పాత్ర కాదని అలా ఎందుకు కనిపిస్తారో తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాలని శ్రీకాంత్ తెలిపారు. బాలయ్యకు తనకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయని శ్రీకాంత్ వెల్లడించారు. శ్రీకాంత్ అఖండ సీక్రెట్స్ రివీల్ చేసి సినిమాపై అంచనాలను మరింత పెంచారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు.

అభిమానుల అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. దాదాపు 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు బాలకృష్ణ ఏడు కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. సింహా, లెజెండ్ సినిమాలను మించి ఈ సినిమా ఉండబోతుందని వేరే లెవెల్ లో అఖండ సినిమా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus