ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి
- November 3, 2026 / 08:57 PM ISTByFilmy Focus Desk
‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకి ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఇందులో నలుగురి కుర్రాళ్ల పాత్రలకు ప్రేక్షకులంతా కనెక్ట్ అయ్యారు. మళ్లీ ‘ఈ నగరానికి ఏమైంది 2’ చిత్రంలో నలుగురు కుర్రాళ్లు రాబోతోన్నారు. ఈ సారి నలుగురి కుర్రాళ్లలో శ్రీనాథ్ మాగంటి కనిపించబోతోన్నారు. కార్తీక్ పాత్రలో శ్రీనాథ్ మాగంటి అందరినీ ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నారు. ENE2 చిత్రాన్ని నవంబర్ 19న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను గమనిస్తే మళ్లీ ఆ నాలుగు పాత్రలు హైలెట్ అవబోతోన్నాయని అర్థం అవుతోంది.
విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ ఎప్పటిలానే తమ టైమింగ్‌తో ఆకట్టుకున్నారనిపిస్తోంది. ఇక ఆ గ్యాంగులో కొత్తగా చేరిన శ్రీనాథ్ సైతం అదరగొట్టేశాడు. ఆల్రెడీ ఆడియెన్స్‌లో రిజిష్టర్ అయిన పాత్రలో మెప్పించడం అంటే అంత సాధారణ విషయం కాదు. అయితే ఈ ట్రైలర్‌ను చూస్తే శ్రీనాథ్ ఈ కార్తిక్ పాత్రలో ఒదిగిపోయాడనిపిస్తోంది. ఆ గ్యాంగ్‌లో ఒకడిగా కలిసిపోయినట్టుగా కనిపిస్తోంది.
ట్రైలర్లో కార్తీక్‌గా శ్రీనాథ్ కామెడీ టైమింగ్, లుక్, ప్రజెన్స్ అన్నీ ప్రత్యేకంగా నిలిచాయి. అతను తన పాత్రలోని భావాన్ని అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఆ పాత్ర ఒక పట్టణ యువకుడు, సంప్రదాయ వృత్తిపరమైన ఎదుగుదల కంటే తన అభిరుచిని ఎంచుకోవడం వల్ల ఎదురయ్యే కాన్ ఫ్లిక్ట్స్ మధ్య నలిగిపోతుంటాడు. ఈ పరిణితిని ఆ గ్యాంగ్‌లోని స్వేచ్ఛాయుతమైన స్నేహబంధంతో సమతుల్యం చేయడం అంత సులభమైన పని కాదు. ఈ సీక్వెల్లో కార్తిక్ పాత్రలో శ్రీనాథ్ ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నాడు.












