వాయిదా పడిన శ్రీనివాస కళ్యాణం విడుదల తేదీ

“శతమానం భవతి”తో దర్శకుడిగా నేషనల్ అవార్డ్ అందుకోవడంతోపాటు దిల్ రాజు నిర్మాణ సంస్థకి మొట్టమొదటి నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన ఏకైక దర్శకుడు సతీష్ వేగేశ్న. అందుకే సతీష్ తదుపరి చిత్రాన్ని కూడా తన బ్యానర్ లోనే నిర్మించడానికి మొగ్గుచూపాడు దిల్ రాజు. నితిన్-రాశీఖన్నా జంటగా “శ్రీనివాస కళ్యాణం” అనే చిత్రాన్ని మొదలెట్టేశాడు కూడా. పెళ్లి వ్యవస్థ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రారంభం అయినప్పుడు జూలైలో విడుదల చేద్దామనుకొన్నారు. అనధికార ప్రకటన కూడా ఇచ్చేశారు.

కట్ చేస్తే.. షూటింగ్ అనుకొన్న ప్రకారం పూర్తవ్వకపోవడంతోపాటు.. చాలా సన్నివేశాలు మార్చాల్సిన అవసరం రావడంతో సినిమాని అనుకొన్న సమయం కంటే ఒక నెల లేట్ గా.. అనగా ఆగస్ట్ లో విడుదల చేయాలనుకొంటున్నట్లు సమాచారం. మిక్కీ జే.మేయర్ సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ చివరివారంలో విడుదలవుతుందట. ఇటీవల డిస్ట్రిబ్యూటర్ గా వరుసగా మూడు పరాజయాలు చవిచూసిన దిల్ రాజు నిర్మాతగా “లవర్, శ్రీనివాస కళ్యాణం” చిత్రాలతో మళ్ళీ ట్రాక్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus