Srinu Vaitla: మారిపోయానంటున్న శ్రీను వైట్ల.. కొత్త కామెడీ చూస్తారంటూ..!

టాలీవుడ్‌లో రీసెంట్‌ టైమ్స్‌లో కామెడీని, యాక్షన్‌ పక్కాగా హ్యాండిల్‌ చేయడంలో బెస్ట్‌ అనిపించుకున్న దర్శకుల్లో శ్రీను వైట్ల (Sreenu Vaitla) ఒకరు. వరుసగా తనదైన శైలిలో కామెడీ సినిమాలు చేస్తూ.. అగ్ర హీరోలతో పని చేసే అవకాశం అందుకున్నారు. అయితే స్టార్‌ హీరోలను హ్యాండిల్ చేయడంలో ఇబ్బంది పడి కెరీర్‌ను ఇరుకున పెట్టేసుకున్నారు. అందరికీ అన్ని సినిమాలు పడవు.. ఎవరికకి ఎలాంటి సినిమా ఇవ్వాలి అనే క్లారిటీ లేకపోవడమే దానికి కారణం అని ఆయన తెలుసుకోకపోవడమే కెరీర్‌లో లాంగ్ గ్యాప్‌కి కారణం అని అంటున్నారు.

Srinu Vaitla

అయితే ఇప్పుడు తన ఆలోచన మారిందని, కొత్తగా ఆలోచించే ‘విశ్వం’ (Viswam)  కథ రాసుకున్నానని చెబుతున్నారు. ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 11న వస్తున్న నేపథ్యంలో ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్లు చేశారు. గోపీచంద్‌తో (Gopichand) సినిమా చేద్దామని మూడు లైన్లు చెప్పారట శ్రీను వైట్ల.. అయితే మూడూ గోపీచంద్‌కు నచ్చినా.. తనకు అవ్వవని నో అనుకున్నారట. ఆ సమయయంలోనే ‘విశ్వం’ సినిమా కథ వచ్చిందని తెలిపారు.

రెండేళ్ల క్రితం ఇదంతా జరిగిందని.. సినిమా కామెడీ ట్రాక్‌ కోసం సుమారు ఎనిమిది నెలలు ఆగామని ఆయన చెప్పారు. అలానే ఈ సినిమా కామెడీ సీన్స్‌ రాసుకున్నామని తెలిపారు. తన సినిమాల్లో కామెడీ ట్రాక్స్‌, సీన్స్‌ విషయంలో కొత్తదనం ఉండటం లేదనే మాట తన వరకు వచ్చిందని, అందుకే కొత్తగా ఈ సినిమాలో ప్లాన్‌ చేశామని కూడా చెప్పారు. కామెడీ ప్లస్‌ యాక్షన్‌ కాంబోలోనే ఈ సినిమా ఉంటుందని శ్రీను వైట్ల చెప్పారు.

మరి ఆ కొత్త ట్రాక్‌ ఏంటి? ఎలా ఉండబోతోంది? గోపీచంద్‌ ఎలా కనిపిస్తారు అనేది తెర మీదే చూడాలి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ సినిమా విజయం ఇటు గోపీచంద్‌కు, అటు శ్రీను వైట్లకు చాలా అవసరం. ఇద్దరూ గత కొంతకాలంగా హిట్‌ రుచి చూసింది లేదు. మరి ఈ ప్రెజర్‌ సిట్యువేషన్‌ను ఎలా ఫేస్‌ చేస్తారో చూడాలి.

‘సత్యం సుందరం’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus