Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ .. దాచేసిన పాత్రలు చాలానే ఉన్నట్టున్నాయిగా..!

  • June 22, 2024 / 10:47 AM IST

మా సినిమాలో ఇంతుంటే.. ఎంతో ఉంది అంటూ గొప్పగా డబ్బా కొట్టుకునే రోజులివి. కానీ ‘కల్కీ..’ (Kalki 2898 AD) టీం మాత్రం అలా చేయడం లేదు. సినిమాలో ఉన్న మేటర్ నే.. సరిగ్గా బయటపెట్టలేదు. ప్రమోషన్స్ సంగతి అలా ఉంచినా… సినిమాలో కంటెంట్ ను కరెక్ట్ గా ఎప్పటికప్పుడు బయటపెడితే ఆడియన్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. ప్రభాస్ (Prabhas) ఉన్నాడు కదా అని.. ఇది మాస్ సినిమా కాదు.పురాణాలతో ముడిపడి ఉన్న ఓ సైన్స్ ఫిక్షన్ డ్రామా.

800 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది? ప్రపంచంలో కాశి చివరి నగరంగా ఎందుకు ఉండిపోయింది? శంభల విశిష్టత ఏంటి? వంటి తెలియాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) వీడియోలు చేసి వదులుతున్నా.. మాస్ జనాలకి అవి అర్థమయ్యేలా లేవు. ఇది వాస్తవం..! ఇది పక్కన పెట్టేస్తే.. ‘కల్కి..’ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన రెండు ట్రైలర్స్ లో అమితాబ్ బచ్చన్  (Amitabh Bachchan)  పాత్రనే ఎక్కువగా చూపించారు. దానినే హైలెట్ చేశారు.

కమల్ హాసన్ (Kamal Haasan) పాత్రని సరిగా చూపించలేదు. మరోపక్క ఈ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) , దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ..లు కూడా నటించినట్టు టాక్ నడిచింది. అయితే ట్రైలర్స్ లో ఆ పాత్రలను చూపించింది లేదు. అంతేకాదు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) , రాజమౌళి (Rajamouli) వంటి స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ సినిమాలో నటించారట. వారి పాత్రలు కూడా సినిమాలో సర్ప్రైజింగ్ గా ఉంటాయట. మరో 6 రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చేస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus