Rajamouli: ‘మత్తు వదలరా 2’ టీంని అడ్డం పెట్టుకుని జక్కన్న పెద్ద వార్నింగే ఇచ్చాడుగా..!

‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత రాజమౌళి (S. S. Rajamouli) , ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తర్వాత మహేష్ బాబు (Mahesh Babu) ..కలిసి ఓ భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘#SSMB29’ గా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమీ ఇంకా రాలేదు. 2020 లోనే రాజమౌళి ఈ ప్రాజెక్టు గురించి ఓపెన్ అయ్యాడు. ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై కే.ఎల్.నారాయణ్, ఎస్.గోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో రూపొందే సినిమా ఇది అని ఫిలింనగర్ టాక్..!

Rajamouli

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే ముమ్మరంగా జరుగుతుంది. ముంబైలో వర్క్ షాప్స్ వంటివి కూడా నిర్వహిస్తున్నాడు రాజమౌళి (Rajamouli). బడ్జెట్ లిమిట్స్ క్రాస్ చేయకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 2026 కి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తుంది. రెండు భాగాలుగా ఈ సినిమాని రూపొందించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇవన్నీ ప్రచారంలో ఉన్న వార్తలే కానీ టీం కన్ఫర్మ్ చేసింది అంటూ ఏమీ లేదు.

ఈ సినిమా గురించి స్పందించడానికి రాజమౌళి (Rajamouli) అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తాజాగా ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara) ప్రమోషన్స్ లో భాగంగా హీరో సింహా కోడూరి (Sri Simha Koduri) , కాలభైరవ (Kaala Bhairava)..లతో రాజమౌళి పాల్గొన్నారు. మధ్యలో హీరో సింహా ‘SSRMB’ ప్రాజెక్టు గురించి అప్డేట్ కావాలని అడిగాడు. దానికి రాజమౌళి పెద్ద కర్ర తీసుకుని వారిని పరిగెత్తిస్తున్నట్టు ఓ వీడియో వైరల్ అవుతుంది. అంటే అప్డేట్ అంటూ మారాం చేసే మహేష్ అభిమానులందరికీ రాజమౌళి ఇలా సమాధానం చెప్పినట్లు అర్థం చేసుకోవచ్చు.

మొన్నటికి మొన్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కూడా అప్డేట్ అడిగితే.. ‘ అనిల్ రావిపూడిని ముసుగేసి కొట్టి వీడియో తీసిన వాళ్ళకి డబ్బులు ఇస్తానని’ రాజమౌళి (Rajamouli) చెప్పిన సంగతి తెలిసిందే. సో ఈ ప్రాజెక్టు విషయంలో రాజమౌళి ఎంత సీరియస్ గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.

యశ్ కెరీర్ ప్లాన్ ఇదేనా.. ఆ సినిమా కోసం బరువు పెరగనున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus