Yash: యశ్ కెరీర్ ప్లాన్ ఇదేనా.. ఆ సినిమా కోసం బరువు పెరగనున్నారా?

శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న యశ్ కు (Yash) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాక్సిక్ సినిమాలో నటిస్తున్న యశ్ ఈ సినిమాతో పాటు బాలీవుడ్ రామాయణం మూవీలో సైతం నటిస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. బాలీవుడ్ రామాయణం మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన షూట్ పూర్తైందని తెలుస్తోంది. సెకండ్ పార్ట్ మొత్తం రావణుని పాత్ర ప్రధానంగా ఉంటుందని ఈ పాత్ర కోసం యశ్ (Yash) 20 కిలోల బరువు పెరగనున్నాడని తెలుస్తోంది.

Yash

టాక్సిక్ మూవీ షూట్ పూర్తైన వెంటనే యశ్ (Yash) బరువు పెరిగి ఈ సినిమాతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. యశ్ రావణుని పాత్రలో బరువు పెరిగి కనిపిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. రాముడు, రావణుడు పాత్రల మధ్య యుద్ధ సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారని తెలుస్తోంది. బాలీవుడ్ రామాయణం ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor) , సాయి పల్లవి (Sai Pallavi) ఈ సినిమాలో రాముడు సీత పాత్రల్లో కనిపించనున్నారు.

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విడుదల కానుండగా త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తుండటంతో సౌత్ లో సైతం ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతున్నాయి. సాయిపల్లవి వరుస సినిమాలలో నటిస్తుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. బాలీవుడ్ రామాయణం పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేసే ప్రాజెక్ట్ అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సాయిపల్లవి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో భాగమవుతూ ఉండటం ఆమె కెరీర్ కు మరింత ప్లస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆనందం అప్పుడే అయిపోలేదయ్యా.. రామజోగయ్య శాస్త్రి కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus