Thaman Son: మొదటిసారిగా కొడుకు ఫోటోని షేర్ చేసిన తమన్.. ఫోటో వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినపడుతున్న పేర్లలో తమన్ పేరు ఒకటి.ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న తమన్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను కూడా అందుకున్నారు. ఈయన సంగీత సారధ్యంలో వచ్చిన అఖండ, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట వంటి సినిమాలు వరుస విజయాలు అందుకోవడమే కాకుండా ప్రస్తుతం ఈయన మరిన్ని సినిమాలకు సంగీతమందిస్తున్నారు.

ఈ విధంగా ఎన్నో సినిమా అవకాశాలను అందుకుని ఎంతో బిజీగా ఉన్నా తమన్ తాజాగా అలా వైకుంఠపురం సినిమాకి గాను నేషనల్ అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే.చిన్నప్పటి నుంచి సంగీతంపై ఎంతో మక్కువ ఉన్నటువంటి తమన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన సినిమా విషయాలను అభిమానులతో పంచుకునే తమన్ తన వ్యక్తిగత విషయాలను మాత్రం ఎప్పుడు ప్రస్తావించలేదు.అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తన భార్య శ్రీ వర్ధిని కూడా ఒక సింగరే అంటూ తన భార్య గురించి అలాగే తన కుమారుడు గురించి చెప్పుకొచ్చారు.ఈ విధంగా తమన్ తనకొక కుమారుడు ఉన్నారనే విషయం తెలియజేశారు కానీ ఇప్పటివరకు అతనికి సంబంధించిన ఫోటోలను ఎక్కడ షేర్ చేయలేదు.

తాజాగా తమ కుమారుడి ఫోటోని మొదటిసారిగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.తన తల్లి 70వ పుట్టినరోజు సందర్భంగా తన కొడుకు ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో ప్రస్తుతం నెటింట్లో వైరల్ గా మారింది. తమ కొడుకు పేరు అజిత్ ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నారు.ఇక తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా తన కొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరూ తమన్ కుమారుడు అచ్చం తమన్ ను పోలి ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

1

2

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus