Mahesh: సూపర్ స్టార్ నిర్ణయం ఫ్యాన్స్ కు నచ్చలేదా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కగా అతడు హిట్ ఫలితాన్ని అందుకుంటే ఖలేజా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. ఖలేజా సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమాను అభిమానించే ఫ్యాన్స్ లక్షల సంఖ్యలో ఉన్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో సినిమా అప్ డేట్ నేడు రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం మహేష్ నిర్ణయం విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సిరీస్ సినిమాలలో నటించడం వల్ల ప్రభాస్ కు పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, చరణ్ లకు కూడా పాన్ ఇండియా హీరోలుగా ఇమేజ్ రానుంది. మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆలస్యమవుతోంది.

ఇలాంటి సమయంలో మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమాకు ఓకే చెబితే రాజమౌళి సినిమా 2022 సెకండాఫ్ లో మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. ​త్రివిక్రమ్ పాన్ ఇండియా కథతో సినిమాను తెరకెక్కించినా రాజమౌళికి ఇప్పటికే పాన్ ఇండియా డైరెక్టర్ గా ఉన్న గుర్తింపు మహేష్ సినిమాకు ప్లస్ అవుతుంది. మహేష్ సర్కారు వారి పాట తరువాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో నటిస్తే బాగుంటుందని మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమాల ఎంపిక విషయంలో తప్పు చేయొద్దంటూ ఫ్యాన్స్ మహేష్ కు సూచనలు చేస్తున్నారు

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus