సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) – రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్ లో రూపొందుతున్న SSMB29 ప్రాజెక్ట్ పై మేకర్స్ ఎంత రహస్యంగా ముందుకెళ్లినా లీకులు మాత్రం ఆగడం లేదు. రాజమౌళి తన సినిమాలకు భారీ ప్లానింగ్ చేస్తాడని, ప్రతి అంశాన్ని కేర్‌ఫుల్‌గా మేనేజ్ చేస్తాడని తెలిసిందే. కానీ, ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి వరుసగా అనధికారిక అప్‌డేట్లు బయటికి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అయితే సినిమాలో విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కన్ఫర్మ్ అయినట్లు మరోసారి వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.
ఇప్పటి వరకు మూవీ కథ, లోకేషన్ డీటైల్స్, మహేష్ బాబు లుక్, షూటింగ్ ప్లాన్.. ఇలా అన్నీ లీక్ అవుతున్నాయి. ఈ మధ్యే పృథ్వీరాజ్, రాజమౌళి, మహేష్ బాబు ముగ్గురు కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో విలన్ రోల్ గురించి ప్రచారం మరింత బలపడింది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వడం, ఆమె తల్లి నుంచి కొన్ని హింట్స్ రావడంతో కాస్త క్లారిటీ వచ్చేసినట్లే.
ప్రస్తుతం చిత్ర బృందం ఒడిశాలో షూటింగ్ జరుపుతుండటంతో మరింత కట్టుదిట్టమైన భద్రతతో ముందుకు వెళ్తున్నారు. కానీ, ఎయిర్‌పోర్ట్‌లో వచ్చిన ఫోటోలు, హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన షూటింగ్ డీటైల్స్ బయటపడటంతో రాజమౌళి టీమ్ మరోసారి అప్రమత్తమైంది. కానీ, ఇటువంటి లీకులు ఎక్కువయ్యే సరికి అభిమానుల్లో ఆఫీషియల్ అప్డేట్ రావాల్సిందే అనే డిమాండ్ పెరుగుతోంది.
టాలీవుడ్‌లో రాజమౌళి సినిమాలకు ఉండే క్రేజ్‌కి తగ్గట్లుగానే SSMB29 కు కూడా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మహేష్ బాబు ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడని, తన లుక్ తో పాటు యాక్షన్ పార్ట్‌లో సరికొత్తగా కనిపించేందుకు రెడీ అవుతున్నాడని టాక్. మరి, ఈ లీకులుకు మేకర్స్ ఎప్పుడు ఎండ్ కార్డ్ పెడతారో చూడాలి.