SSMB29 లీక్స్.. రాజమౌళికి ఆ మాత్రం తెలియదా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) , ఎస్ ఎస్ రాజమౌళి (S. S. Rajamouli)   కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 సినిమా మీద దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా గురించి అధికారికంగా పెద్దగా అప్‌డేట్ లేకపోయినా, ఓ లీక్ వీడియో మాత్రం ప్రాజెక్ట్‌ను టాక్‌లోకి తీసుకొచ్చింది. ఒడిశా కోరాపుట్‌లో జరుగుతున్న షూటింగ్ లొకేషన్ నుంచి కొన్ని ఫుటేజీలు బయటకు రావడం, వాటిలో మహేశ్ బాబు కనిపించడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇది కావాలనే జరిపించారా? లేక భద్రతా లోపమా? అనే చర్చ నడుస్తోంది.

SSMB29

రాజమౌళి గత సినిమాల్లోనూ లీక్ ఘటనలు జరిగినప్పటికీ, సినిమా ప్రారంభ దశలోనే ఇంత పెద్ద లీక్ జరగడం ఇదే తొలిసారి. గతంలో RRR స్టిల్స్ బయటకొచ్చినా, వాటిని వెంటనే కంట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా వీడియో లీక్ కావడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా రాజమౌళి సినిమాలకు అత్యధిక భద్రతను కల్పిస్తారు. షూటింగ్ స్పాట్‌కి అనుమతి లేని వ్యక్తులను దగ్గరకి రానివ్వరు. కానీ ఈసారి ఈ నిబంధనలు పాటించకపోవడమా? లేక మరేదైనా కారణమా?

ఇదంతా కావాలనే లీక్ చేశారా? లేక నిజంగానే భద్రతా లోపమా? అన్నది క్లారిటీ రాలేదు. రాజమౌళి సినిమాలకు లీక్ ప్రచారం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తే, మరోవైపు ఇదంతా మేనేజ్‌డ్ ప్రమోషన్ అని మరికొందరు చెబుతున్నారు. కానీ ఈ ఘటన తర్వాత టీమ్ మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రయూనిట్ సభ్యులకు కఠినమైన నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్‌లు పెట్టారని, అయినప్పటికీ ఈ ఘటన జరగడం యూనిట్‌ను ఆశ్చర్యానికి గురిచేసిందట.

మహేశ్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా (Priyanka Chopra), మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించనున్నారు. కేవలం ఈ లీక్ కారణంగా సినిమా సీక్రెసీ దెబ్బతినదనే నమ్మకం ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మరిన్ని లీక్‌లను అరికట్టేందుకు టీమ్ మరింత కఠినమైన చర్యలు తీసుకోనుందని సమాచారం. రాజమౌళి రూపొందిస్తున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ 2027లో విడుదల కానుందని టాక్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus