మహేష్ బాబు (Mahesh Babu) -రాజమౌళి (S. S. Rajamouli) కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ29 సినిమాపై అంచనాలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా, ఇటీవల ప్రియాంక చోప్రా గ్యాప్ తీసుకోవడం వల్ల కొద్దిరోజులుగా బ్రేక్‌లో ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వారం నుంచి మళ్లీ షూటింగ్ రీ స్టార్ట్ అవుతుందని టాక్.
ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాపై (Priyanka Chopra) కీలక సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ నానా పాటేకర్ (Nana Patekar) కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ అవుతాడన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. నానా పాటేకర్ క్యారెక్టర్ ఏమిటనేది ఇప్పటివరకు సస్పెన్స్‌గానే ఉంది. ఇదిలా ఉంటే, ప్రియాంక చోప్రా పాత్రకు రాజమౌళి స్పెషల్ లేయర్స్ ఇచ్చాడన్న టాక్ హాట్ టాపిక్‌గా మారింది. ఆమె క్యారెక్టర్‌లో కొన్ని నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయనే రూమర్స్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి.
రాజమౌళి సినిమాల్లో ప్రతి క్యారెక్టర్‌లో ట్విస్ట్ ఉండడం కామన్ కాబట్టి, ప్రియాంక పాత్ర కూడా ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వనుందనడంలో సందేహం లేదు. మరొక వైపు, ఈ మూవీ ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి (M. M. Keeravani) ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో, మ్యూజిక్ కూడా సినిమాకు మరో ఎస్సెట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.
ఎస్ఎస్ఎంబీ29కు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను మేకర్స్ చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నారు. అందుకే ఫ్యాన్స్ నుంచి ఏదైనా చిన్న లీక్ వస్తేనే హాట్ టాపిక్‌గా మారుతోంది. మొత్తానికి ప్రియాంక క్యారెక్టర్‌లో ఉన్న ఈ మిస్టరీపై త్వరలోనే రాజమౌళి క్లారిటీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.