ప్రముఖ యాక్టర్‌ ఇక లేరు.. అతని తనయుడు కూడా నటుడే!

ప్రముఖ సినిమా, టీవీ నటుడు అల్లం గోపాలరావు (75) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా శనివారం ఉదయం 8 గంటలకు తన నివాసంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గోపాలరావు భార్య విమల, ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో అనిల్ సినిమాలు, టీవీల్లో నటిస్తూ అందరికీ పరిచయస్తులే. మరో తనయుడు సునీల్‌ ఉన్నారు.

Allam Gopalarao

గోపాలరావు అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. గోపాలరావు భౌతిక కాయానికి పలువురు సినీ, టీవీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) మేనేజ్‌మెంట్‌ కమిటీ కూడా గోపాలరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.

అల్లం గోపాలరావు తనయుడు అనిల్‌ ‘వరూధిని పరిణయం’, ‘జానకి కలగనలేదు’ లాంటి సీరియళ్లతో పరిచయస్తులే. ఇక అల్లం గోపాలరావు నటుడిగానే కాకుండా, సోషల్‌ మీడియాలో కొన్ని సైన్స్‌ సంబంధిత వీడియోలు చేస్తూ నేటి యువతకూ పరిచయస్థేలు.

‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus