బిల్డింగ్ పై నుంచి కిందపడిన నటుడు.. తీవ్ర గాయాలు!

సినిమా షూటింగ్ లలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు అనుకోకుండా జరిగిన ఘటన వలన నటీనటులు టెక్నీషియన్లు తీవ్రస్థాయిలో గాయాల పాలవుతుంటారు ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లను కూడా ప్రాణాలు కూడా పోయె ప్రమాదం పొంచి ఉంటుంది. శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ సమయంలో సహాయ దర్శకులు టెక్నీషియన్లు కొందరు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఒక దర్శక నటుడు పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతను మరెవరో కాదు తమిళ దర్శకుడు,

నటుడు చేరన్. ఇటీవల షూటింగ్లో పాల్గొన్న చేరన్ ఒక బిల్డింగ్ పై నుంచి అకస్మాత్తుగా కింద పడిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు ఎనిమిది కుట్లు వేశారు. వెంటనే ఆసుపత్రికి తీసుకు రావడం వల్ల అతను పెను ప్రమాదం నుంచి ఇప్పించుకున్నట్లు వైద్యుల వివరణ ఇచ్చారు. చేరన్ దర్శకుడిగా తమిళంలో కొన్ని మంచి సినిమాను తెరకెక్కించారు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మొదట తమిళంలోనే దర్శకత్వం వహించి , చేరన్ హీరోగా నటించాడు.

తెలుగులో గోపాల్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించాడు. ఇక చేరన్ కు జరిగిన ప్రమాదం విషయానికి వస్తే నంద పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆనందం విలయటం వీడు’ అనే సినిమా షూటింగ్‌లో చరణ్ ఒక ఇల్లు కడుతున్న మెస్ట్రీ పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్ లోనే అకస్మాత్తుగా కాలు జారీ మొదటి అంతస్తు నుంచి కింద పడిపోవడం వలన ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తున్నాడు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus