చలనచిత్ర పరిశ్రమకు ప్రతి ఏడాది ప్రకటించే ఆస్కార్ అవార్డు వేడుకల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి అన్ని దేశాల చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ఇకపోతే 2023వ సంవత్సరంలో జరగనున్న ఆస్కార్ వేడుకల కోసం ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్ రాక్ కి వ్యాఖ్యతగా వ్యవహరించమని ఆహ్వానం అందింది. ఈ క్రమంలోనే నటుడు క్రిస్ రాక్ ఎంతో సున్నితంగా ఈ అవకాశాన్ని తిరస్కరించారు.
2022 వ సంవత్సరంలో జరిగిన ఆస్కార్ వేడుకలలో భాగంగా నటుడు విల్ స్మిత్ అందరి ముందే వేదికపై క్రిస్ రాక్ పై చేయి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.క్రిస్ విల్ స్మిత్ భార్య అనారోగ్య సమస్య గురించి హేళనగా మాట్లాడటంతో ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విల్ తనపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనను క్రిస్ ఎంతో అవమానకరంగా భావించారు. ఈ క్రమంలోనే ఈ ఘటన తర్వాత క్రిస్ పెద్దగా ఎక్కడ కనిపించలేదు. అలాగే తనకు వచ్చినటువంటి అవకాశాలను కూడా వదులుకున్నారు.
ఈ చెంప ఘటన తర్వాత ఈయనకు సూపర్ బౌల్ యాడ్‌లో కనిపించడానికి కూడా తాను నిరాకరించానని తెలిపారు.అయితే 2023లో జరిగే ఆస్కార్ వేడుకలకు తనని వ్యాఖ్యాతగా వ్యవహరించమని అవకాశం వచ్చిందని అయితే తనకు ఎక్కడ అవమానం జరిగిందో తిరిగి ఆ ప్రదేశానికి వెళ్లడానికి తాను ఇష్టపడటం లేదని తెలిపారు ఇలా తనకు వచ్చిన అవకాశాన్ని ఈయన వదులుకున్నారు.
ఇక ఈ విషయం జరిగిన అనంతరం విల్ స్మిత్ ఆగ్రహంతో తనపై చేయి చేసుకున్నానని,అందుకు ఆయన బహిరంగంగా తనకు క్షమాపణలు తెలియజేశారు. అయితే ఇలా క్షమాపణలు తెలియచేయడం చాలా తక్కువ అని వీలైతే ఆయనని కలిసి తనకు అవకాశం ఇస్తే స్వయంగా క్షమాపణలు చెబుతానంటూ కూడా విల్ స్మిత్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేసిన విషయం మనకు తెలిసిందే.