ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు మృతి చెందారు. ఇంకా బ్యాడ్ న్యూస్..లు వింటూనే ఉన్నాం. కోటా శ్రీనివాసరావు, ఏ.ఎస్.రవికుమార్ చౌదరి వంటి స్టార్లు ఎంతో మంది మృతి చెందారు.అనారోగ్య సమస్యలతో కొంతమంది, ప్రమాదవశాత్తు ఇంకొంత మంది, రోడ్డు ప్రమాదాల్లో ఇంకొంతమంది,ఆత్మహత్య చేసుకుని ఇంకొంత మంది ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం కె.జి.ఎఫ్ నటుడు హరీష్ రాయ్,బాలీవుడ్ సీనియర్ నటి సులక్షణ పండిట్ వంటి వారు మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఆ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. హిందీ సినీ పరిశ్రమలో ఈ విషాదం చోటు చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఈయన.. ఇటీవల పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు తెలుస్తుంది. చికిత్స పొందుతూనే ఈరోజు సాయంత్రం ఆయన కన్నుమూసినట్టు సమాచారం.
అమితాబ్ తో కలిసి నటించిన ‘షోలే’తో ధర్మేంద్ర పేరు ఇండియా మొత్తం మార్మోగింది. ఇతన్ని బాలీవుడ్ హీ- మ్యాన్ అని కూడా అంటుంటారు. నిర్మాతగా కూడా ఈయన సినిమాలు చేశారు. 1960 లో వచ్చిన ‘దిల్ బి తేరా హమ్ బి తేరే’ సినిమాతో నటుడిగా మారారు ధర్మేంద్ర. తర్వాత ‘షాదీ’ ‘దేవార్’ ‘దిల్ క హీర’ వంటి సినిమాల్లో ఈయన నటించారు. ఇండియన్ సినిమాల్లో ఉన్న గొప్ప నటుల్లో ధర్మేంద్ర పేరు సువర్ణాక్షరాలతో లికింపబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.