ఈ మధ్య కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పేరుగాంచిన నటీనటులు, డైరెక్టర్లు, నిర్మాతలు, ఫ్యాషన్ డిజైనర్లు, లేదా సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. తెలుగులో మాత్రమే కాదు పక్క రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రముఖులు కూడా మరణిస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ఈ మధ్య కాలంలో కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా ప్రముఖ నటుడు కేలు.. ప్రాణాలు విడిచాడు. నవంబర్ 2న అంటే బుధవారం నాడు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆయన మరణించడం జరిగింది. పదేళ్ల క్రితం మలయాళంలో రూపొందిన ‘సాల్ట్ ఎన్ పెప్పర్’ అనే చిత్రంతో నటుడిగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కేలు. ‘మూప్పన్’ అనే పాత్రలో చాలా బాగా నటించి ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నారు. కేలుకి భార్య పుష్ప.. పిల్లలు రాజన్, మణి, రామ ఉన్నారు.
ఇతను .. చెన్నిలారా కురిచియా కుటుంబంలో జన్మించాడు.. కేరళలోని వాయనాడ్ జిల్లా మనంతవాడి ప్రాంతంలో నివసించే కురిచ్యార్ కమ్యూనిటీకి చెందిన గిరిజన నాయకుడు ఇతను అని తెలుస్తుంది. ఇతని వయస్సు 90 ఏళ్ళు. ‘పజ్సిరాజా’, ‘ఉండా’ ‘బ్లాక్ కాఫీ’ మొదలగు సినిమాల్లో ఇతను నటించాడు. ఇతని ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమలోని కొంతమంది నటీనటులు కోరుకుంటున్నారు. కేలు అంత్యక్రియలు బుధవారం నాడు జరిగినట్లు తెలుస్తుంది.