విలన్ రఘువరన్ కొడుకు గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు..!

‘ఎవడ్రా శివ’.. ‘శేషు.. హే మాస్’ ‘అటు చూడు…’ వంటి డైలాగులు చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు రఘువరన్. కేరళకి చెందిన వ్యక్తే అయినప్పటికీ తెలుగు, తమిళ సినిమాలతో స్టార్ గా ఎదిగారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంతో కలుపుకుని మొత్తంగా ఆయన 150 కి పైగా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించారు. పలు సినిమాల్లో సహాయ నటుడిగా కూడా కనిపించినప్పటికీ రఘువరన్ విలనిజం కే బాగా ఫేమస్ అయ్యారు.

ఈయన విలన్ గా చేస్తున్నప్పటికీ అప్పట్లో ఈయనకి బోలెడంత మంది లేడీ ఫ్యాన్స్ ఉండేవారు అన్న సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. స్టార్ హీరోల సినిమాల్లో రఘువరన్ మాత్రమే విలన్ గా కావాలి అనే డిమాండ్ కూడా ఏర్పడింది. ‘సుస్వాగతం’ సినిమాలో పవన్ కళ్యాణ్ కు తండ్రిగా, ‘బాబీ’ సినిమాలో మహేష్ బాబు కి తండ్రిగా, ‘నాగ’ సినిమాలో ఎన్టీఆర్ కు తండ్రిగా కూడా ఈయన చేశారు. ఇక ఈయన పర్సనల్ లైఫ్ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది.

ఒకప్పటి హీరోయిన్, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన రోహిణి ని రఘువరన్ వివాహం చేసుకున్నారు. 1996 లో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు సాయి ఋషి వరుణ్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు. అయితే 2004 లో రఘువరన్- రోహిణి లు విడాకులు తీసుకున్నారు. అటు తర్వాత డ్రగ్స్ వంటి వాటికి బానిసై పోవడం వలన రఘువరన్ ప్రాణాలు కోల్పోయారు.

ఇక రోహిణి రఘువరన్ ల తనయుడు సాయి రిషి వరణ్ హీరోగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. తన తండ్రి విలన్ గా రాణించారు కాబట్టి.. ఇతను విలన్ గా రాణించాలి అని భావిస్తున్నాడు. అందుకోసం నటనలో శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు వినికిడి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus