పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తిరుపతి లడ్డూ ఇష్యూని నేషనల్ లెవల్లో వైరల్ చేసి “సనాతన ధర్మం”ను కాపాడుకోవాల్సిన బాధ్యతను తాను భుజాల మీద వేసుకుంటున్నట్లు ప్రకటించగానే తమిళ ఇండస్ట్రీ మరియు ద్రవిడ ధర్మాన్ని పాటించే తమిళులు పవన్ కళ్యాణ్ ను దారుణంగా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు ఆయన అభిమానుల నుంచి తప్ప సినిమా ఇండస్ట్రీ నుంచి ఏమాత్రం సపోర్ట్ లభించలేదు. అయితే.. నిన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ సంస్థాపన & పరిరక్షణకు మద్దతు పలికాడు.
Pawan Kalyan
అతడే నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) . కమెడియన్ గా అందరికీ సుపరిచితుడైన రాహుల్ రామకృష్ణ, తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇదివరకు కూడా ఇదివరకు కూడా కొన్నిసార్లు వార్తల్లో నిలిచినప్పటికీ.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేసి మరోమారు అందరికీ మరింత చేరువయ్యాడు. నిన్న రాహుల్ రామకృష్ణ తన ట్విట్టర్లో.. “@PawanKalyan గారి రాజకీయ వాక్చాతుర్యం వ్యావహారికసత్తావాదం, గుర్తింపు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రజల సామాజిక మరియు సాంస్కృతిక వాస్తవికతలో పాతుకుపోయింది.
భావజాలం మాత్రమే కాల పరీక్షను తట్టుకుంటుంది- మన రాజకీయ వర్ణపటంలోని పురాతన వామపక్షాలు మరియు పిడివాద కుడి పక్షాలు మౌనంగా అంగీకరించిన వాస్తవాన్ని. ఒకప్పుడు గొప్ప పేర్లు మరియు ఇతిహాసాల పాత కవచం పడిపోవడం ప్రారంభించినప్పుడు, ఇది మనందరికీ, ముఖ్యంగా ఈ దేశంలోని యువతకు, ప్రాంతీయ మరియు జాతీయ రాజకీయాల తదుపరి దశాబ్దాన్ని చూడటం మరియు గమనించడం నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన కాలం అవుతుంది.
అది ఖచ్చితంగా శ్రీ @పవన్ కళ్యాణ్ గారు మరియు ఆయన సహజ ప్రత్యర్థుల వంటి అనేక మంది ప్రముఖులచే రూపొందించబడుతుంది” అంటూ రాహుల్ వేసిన ట్వీట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఖుష్ చేయడమే కాక అన్నీ మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. మరి ఈ కామెంట్ కు పవన్ ఏమైనా రెస్పాండ్ అవుతాడో లేదో చూడాలి.
@PawanKalyan garu’s political rhetoric is that of pragmatism, identity and is rooting itself into the social and cultural reality of the Telugu speaking inhabitants of the state of Andhra Pradesh.
Ideology alone will survive the test of time- a fact silently accepted by the…