మరోసారి విడాకుల వార్తలపై స్పందించిన నటుడు.!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకునే విషయం మనకు తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు సంతానం కూడా కలరు రాజీవ్ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండగా సుమా మాత్రం పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా సినిమా ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా కెరీర్ పరంగ వీరిద్దరూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వీరిద్దరూ ఎంతో బిజీగా ఉండగా వీరి గురించి గత కొంతకాలంగా విడాకులు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. సుమ రాజీవ్ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారని వీరిద్దరూ విడిపోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు వీరిద్దరూ ఖండిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇక తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజీవ్ కనకాలకు మరోసారి విడాకుల ప్రశ్నలు ఎదురయ్యాయి ఈ క్రమంలోని ఈయన మరోసారి వీరి విడాకుల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్కూల్లో పిల్లలు ఇబ్బంది పడ్డారు… నేను సుమ విడాకులు తీసుకొని విడిపోతున్నామంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ తాను సుమా షో కి గెస్ట్ గా వచ్చానని అలాగే తన కార్యక్రమాలకు వెళ్లానని తెలిపారు. అదేవిధంగా యుఎస్ వెళ్లినప్పుడు అక్కడ కూడా ఇద్దరం కలిసి ఎన్నో రీల్స్ చేశామని తెలిపారు. ఇలా మేమిద్దరం కలిసే ఉన్నామని ఎప్పటికప్పుడు చెబుతూ ఉన్నా కూడా ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇలా మా విడాకుల వార్తలు వచ్చినప్పుడు మాకేమి పెద్దగా అనిపించలేదు కానీ పిల్లలు స్కూల్ కి వెళ్లే సమయంలో ఇలాంటి టాపిక్ రావడంతో అక్కడ అందరూ అడిగే ప్రశ్నలకు పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారని, ఇప్పటికైనా మా విడాకుల వార్తలను ఆపేయాలి అంటూ ఈ సందర్భంగా మరోసారి రాజీవ్ కనకాల చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus