Jaya Prada: జయప్రద చెంపదెబ్బ గురించి క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నటుడు.. ఏమైందంటే?

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ప్రముఖ నటుడు దాలిప్ తాహిల్ ను జయప్రద ఒక సందర్భంలో చెంపదెబ్బ కొట్టారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తల గురించి దాలిప్ తాహిల్ ఒక సందర్భంలో స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జయప్రద అంటే నాకెంతో గౌరవమని ఆయన అన్నారు.
జయప్రద అందమైన నటి అని ఒక సినిమా సెట్ లో జయప్రద నాపై ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ వైరల్ అయిన వార్తలను చూసి నేను ఆశ్చర్యపోయానని దాలిప్ తాహిర్ వెల్లడించారు.

ఆ సంఘటన ఏ సినిమా సెట్ లో జరిగిందో చెబితే నేను కూడా తెలుసుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు. నేను ఇప్పటివరకు జయప్రదతో స్క్రీన్ షేర్ చేసుకోలేదని దాలిప్ తాహిర్ వెల్లడించడం గమనార్హం. కెరీర్ తొలినాళ్లలో నేను విలన్ రోల్స్ లో ఎక్కువగా చేశానని ఆయన అన్నారు. అందువల్ల అత్యాచారం సీన్స్ నాతో ఎక్కువగా షూట్ చేసేవారని దాలిప్ తాహిర్ అన్నారు.

అత్యాచార సన్నివేశం ఉంటే ఏదైనా (Jaya Prada) హీరోయిన్ కు ముందుగా చెప్పాలని కోరేవాడినని దాలిప్ తాహిర్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. హీరోయిన్లు ఓకే అంటే మాత్రమే ఆ సీన్ లో నటించేవాడినని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ డైరెక్టర్ బలవంతం చేస్తే సెట్ నుంచి వెళ్లిపోతానని బెదిరించేవాడినని దాలిప్ తాహిర్ అన్నారు. అంకుర్ అనే సినిమాతో దాలిప్ తాహిర్ కెరీర్ మొదలైంది.

ఈ ప్రముఖ నటుడు శక్తి, గాంధీ, జల్వా, బాజీఘర్, ఇష్క్, రేస్, హలో, ప్రిన్స్, దర్బార్, హిట్ : ది ఫస్ట్ కేస్ సినిమాలలో నటించారు. ఈ నటుడు తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తెలుగులో కూడా ఈ నటుడికి చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమా ఆఫర్లు వస్తున్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus